Chiranjeevi: టికెట్స్ ధరలు పెంచడం అడుక్కోవడం కాదు టాక్స్ కడుతున్నాం...!

Published : Apr 26, 2022, 02:33 PM IST
Chiranjeevi: టికెట్స్ ధరలు పెంచడం అడుక్కోవడం కాదు టాక్స్ కడుతున్నాం...!

సారాంశం

ఆచ్యార టీమ్ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టికెట్స్ ధరలు పెంపు అవసరమా అంటూ ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు చిరంజీవి కొంచెం ఘాటుగా స్పందించారు.   

స్టార్ హీరోల సినిమాలు థియేటర్స్ లో చూడడం మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద సమస్యగా మారింది. విపరీతంగా పెరిగిన టికెట్స్ ధరల కారణంగా సామాన్యులకు వినోదం దూరమవుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్స్ ధరలు పెంచుతూ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలకు అదనంగా మొదటి వారం లేదా రెండు వారాలు ధరలు పెంచుకుని అమ్ముకునేలా ప్రత్యేక అనుమతులు ఇస్తున్నారు. భీమ్లా నాయక్, ఆర్ ఆర్ ఆర్, కెజిఎఫ్2 , రాధే శ్యామ్ చిత్రాల టికెట్స్ ధరలు అత్యధికంగా థియేటర్స్ లో రూ. 400 పైనే అమ్మారు. ఇద్దరు సినిమా చూడాలన్నా వేయి రూపాయల బడ్జెట్ సరిపోవడం లేదు. 

ఇక చిరంజీవి లేటెస్ట్ మూవీ ఆచార్య (Acharya)టికెట్స్ ధరలు పెంచుతూ ఏపీ/తెలంగాణ ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. ఈ క్రమంలో చిరంజీవి సినిమా అంటే జనాలు థియేటర్స్ కి పోటెత్తుతారు. అలాంటిది మీరు కూడా టికెట్స్ ధరలు పెంచాల్సిన అవసరం ఏముందని ఓ విలేకరి ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు చిరంజీవి (Chiranjeevi)సమాధానం చెప్పారు. ఆయన మాట్లాడుతూ.. కరోనా విపత్తు కారణంగా అన్ని పరిశ్రమలు కుదేలయ్యాయి. చిత్ర పరిశ్రమ కూడా భారీగా నష్టపోయింది. సినిమా బడ్జెట్ అనుకున్న దానికంటే పెరిగిపోయింది. రూ. 50 కోట్లు వడ్డీల రూపంలో కట్టాము. 

ఇలాంటి పరిస్థితుల్లో కొంచెం ఆసరా కోరడం తప్పేమీ కాదు. ప్రభుత్వాలు టికెట్స్ ధరలు పెంచుకునేలా జీవోలో జారీ చేసి మద్దతిస్తున్నాయి. టికెట్స్ ధరలు పెంచుకోవడం అడుక్కోవడం కూడా కాదు. మనం అందరం ప్రభుత్వాలకు టాక్స్ కడుతున్నాం. అందరికంటే అత్యధికంగా 42% టాక్స్ కడుతున్నాం. అలాంటప్పుడు కొంత తిరిగి తీసుకోవడం తప్పులేదు. సినిమా బడ్జెట్ పెరిగిపోయింది. కష్టపడి సినిమా తీశారు, వినోదం పంచుతున్నారని ప్రజలు ఓ పదిరూపాయలు ఎక్కువ చెల్లిస్తున్నారు. కాబట్టి టికెట్స్ ధరలు పెంచి జస్టిఫై చేస్తున్నాం, ఇందులో తప్పేమీ లేదు.. అని చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. 

ఇక ఏపీలో టికెట్స్ దరల పెంపుకు చిరంజీవి చాలా కృషి చేశారు. దాదాపు మూడు నెలలు ప్రయత్నాలు చేసి ఏపీ ప్రభుత్వం టికెట్స్ ధరలు పెంచడంలో విజయం సాధించారు. కాగా మారిన సమీకరణాల నేపథ్యంలో భారీ బడ్జెట్ చిత్రాలు ఓపెనింగ్స్ ద్వారానే పెట్టుబడిలో యాభై శాతానికి పైగా రాబట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎంత పెద్ద హిట్ మూవీ అయినా వందల రోజులు థియేటర్స్ లో ఆడే రోజులు పోయాయి. మొదటి వారంలోనే సినిమా భవిష్యత్ తేలిపోతుంది. దీంతో అధిక ధరలతో ఎక్కువ థియేటర్స్ లో చిత్రాలు విడుదల చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode:అత్తను ఒప్పించిన దీప-సారీ చెప్పిన శౌర్య-కావేరికి దొరికిపోయిన శ్రీధర్
OTT లో ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాలు వెబ్ సిరీసులు, సస్పెన్స్,థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి పండగే..