Beast:ఫ్లాఫైతే ..పార్టీలేంటి రాజా, నష్టపోయినోళ్లు గోలెత్తుతున్నారు

Surya Prakash   | Asianet News
Published : Apr 26, 2022, 12:56 PM IST
Beast:ఫ్లాఫైతే ..పార్టీలేంటి రాజా, నష్టపోయినోళ్లు గోలెత్తుతున్నారు

సారాంశం

విజయ్ సొంత రాష్ట్రం తమిళనాడులో కూడా ‘కేజిఎఫ్ 2’ కోసం బీస్ట్ ని థియేటర్స్ లో నుంచి తీసేసారు. దీంతో బీస్ట్ సినిమా భారీ నష్టాలని మూటకట్టుకుంది. అయితే హీరో విజయ్ మాత్రం అవన్నీ పట్టించుకున్నట్లు లేరు. తన టీమ్ అందరికీ పార్టీ ఇచ్చారు. 


సాధారణంగా ఓ సినిమా ఫ్లాఫ్ అయితే టీమ్ లో ఒకరినొకరు నిందులు వేసుకుంటారు. ఆ ఫ్లాప్ ని ఒకరిపై మరొకరు తోసుకునే ప్రయత్నం చేస్తారు. అయితే హీరో విజయ్ విధానం వేరుగా ఉంది. ఆయన తన టీమ్ కు పార్టీలు ఇస్తున్నారు. “కో కో కోకిల, డాక్టర్” వంటి సక్సెస్ ఫుల్  సినిమాలతో ప్రామిసింగ్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్నారు  నెల్సన్ దిలీప్ కుమార్. ఆయన  దర్శకత్వం వహించిన “బీస్ట్” సినిమా విడుదలైంది. స్టార్ హీరో విజయ్ నటించిన ఈ సినిమాపై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. నెట్ ఫ్లిక్స్ లో విశేష ప్రేక్షక ఆదరణ చూరగొన్న “మనీ హేస్ట్” మాదిరి కంటెంట్ తో తెరకెక్కింది  “బీస్ట్” అనే ప్రచారం నడిచింది. 

కామెడీ విషయంలో నెల్సన్ కు మంచి గ్రిప్ ఉందన్న విషయాన్ని, తొలి రెండు సినిమాలు “కో కో కోకిల, డాక్టర్” స్పష్టం చేసాయి.  అదొక ప్లస్ గా మారింది. ఈ నేపధ్యంలో రిలీజైన ఈ చిత్రం ఏ మేరకు సగటు ప్రేక్షకుడుని ఎంటర్టైన్ చేసింది...అంటే కొంతమేరకే అని చెప్పాలి.  ఈ సినిమా మొదటి రోజు నుంచే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. దాంతో మొదటి రోజు ఓపెనింగ్స్ మాత్రం వచ్చాయి. కానీ ఆ తర్వాత రోజే ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న ‘కేజిఎఫ్ 2’ విడుదల అవ్వడంతో ‘బీస్ట్’కి లాస్ స్టార్టైంది. 

‘కేజిఎఫ్ 2’ సినిమా ఫస్ట్ డే  నుంచే హిట్ టాక్ తెచ్చుకొని పాన్ ఇండియా వైడ్ అన్ని భాషల్లో కలెక్షన్లని కొల్లగొట్టింది. చాలా ఏరియాలలో ‘కేజిఎఫ్ 2’ సినిమాకి ఉన్న రెస్పాన్స్ చూసి బీస్ట్ ని తీసేసారు. విజయ్ సొంత రాష్ట్రం తమిళనాడులో కూడా ‘కేజిఎఫ్ 2’ కోసం బీస్ట్ ని థియేటర్స్ లో నుంచి తీసేసారు. దీంతో బీస్ట్ సినిమా భారీ నష్టాలని మూటకట్టుకుంది. అయితే హీరో విజయ్ మాత్రం అవన్నీ పట్టించుకున్నట్లు లేరు. తన టీమ్ అందరికీ పార్టీ ఇచ్చారు. ఈ ఫొటో ఇప్పుడు వైరల్ అయ్యింది.దాంతో ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసి నష్టపోయిన వాళ్లు గోలెత్తితున్నారు. తాము డబ్బులు పోగొట్టుకుని బాధపడుతూంటే ఈ పార్టీలేంటని అంటున్నారు. ఇక బీస్ట్ సినిమాని తెలుగులో దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేశారు 
 

PREV
click me!

Recommended Stories

Emmanuel lover ఎవరో తెలుసా? డాక్టర్ ను పెళ్లాడబోతున్న బిగ్ బాస్ 9 టాప్ కంటెస్టెంట్
Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్