ఆంజనేయుడు అందరివాడు వివాదం చేయకండి- బ్రహ్మానందం

By team teluguFirst Published Jun 6, 2021, 3:35 PM IST
Highlights

ఈమధ్య విడుదలైన జాతిరత్నాలు మూవీలో బ్రహ్మానందం లాయర్ గా కడుపుబ్బా నవ్వించారు. బ్రహ్మానందం నటుడు కాకుండా మంచి వక్త, డ్రాయింగ్ ఆర్టిస్ట్ కూడా.


హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ఈ మధ్య సినిమాలు తగ్గించారు. దశాబ్దాలపాటు బ్రహ్మనందం తన కామెడీతో ప్రేక్షకులకు వినోదం పంచుతున్నారు. ఇక బ్రహ్మానందం లేని సినిమా అంటూ ఉండేది కాదు ఓ ఐదేళ్ల క్రింద వరకు. ఆ మధ్య బ్రహ్మానందం ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. ఆసుపత్రిలో చేరి చికిత్స అనంతరం కోలుకొని బయటికి వచ్చారు. 

ఇప్పుడిప్పుడే నటుడిగా మరలా బిజీ అవుతున్నారు ఆయన. ఈమధ్య విడుదలైన జాతిరత్నాలు మూవీలో బ్రహ్మానందం లాయర్ గా కడుపుబ్బా నవ్వించారు. బ్రహ్మానందం నటుడు కాకుండా మంచి వక్త, డ్రాయింగ్ ఆర్టిస్ట్ కూడా.లాక్ డౌన్ సమయంలో ఆయన శ్రీరామాంజనేయులు, వెంకటేశ్వర స్వామి విగ్రహాల బొమ్మలను పెన్సిల్  తో అద్భుతంగా చిత్రించారు. బ్రహ్మానందం దైవ భక్తి కూడా ఎక్కువే. 


కాగా ఈ మధ్య హనుమంతుడు జన్మస్థలం విషయంలో టీటీడీ, కిష్కింద సంస్థాన్ ట్రస్ట్ మధ్య వివాదం నడుస్తుంది. దీనిపై తన అభిప్రాయం ఏమిటో చెప్పాలని బ్రహ్మానందంని అడుగగా... హనుమంతుడు భక్తికి, విశ్వాసానికి నిదర్శనం. ఆయన పలానా చోట జన్మించాడని గొడవపడటం కంటే, భారత దేశంలో పుట్టాడని ఆనంద పడడం మేలు. ఇలాంటి వివాదాలు అనవసరం అన్నారు. 


ప్రస్తుతం దర్శకుడు కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ మూవీలో బ్రహ్మానందం కీలక రోల్ చేస్తున్నారు. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణలు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు చేస్తున్నారు. 

click me!