కూతురుకు చిరంజీవి కాస్ట్లీ గిఫ్ట్.. ‘ఇంకెలా వర్ణించగలం’ అంటూ ఎమోషనల్ అయిన మెగా డాటర్!

By Asianet News  |  First Published Mar 9, 2023, 6:49 PM IST

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మహిళా దినోత్సవం సందర్భంగా తన పెద్ద కూతురు సుష్మితా కొణిదెలకు కాస్ట్లీ గిఫ్ట్ అందించారు. ఇందుకు సుష్మిత తన తండ్రికి ధన్యవాదాలు తెలుపుతూ ఎమోషనల్ అయ్యారు.


మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తూనే ఉన్నారు. మరో వైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు. స్పెషల్ డేలలో స్పందిస్తూ తన మార్క్ చూపిస్తున్నారు. నిన్న అంతర్జాతీయ మహిళా  దినోత్సవం  2023 సందర్భంగా ఇంట్రెస్టింగ్ పెట్టిన విషయం తెలిసిందే. తల్లి, భార్య తో కలిసి ఉన్న ఫొటోను పంచుకుంటూ తన జీవితంపై ప్రభావితం చూపిన మహిళలు వీరే అంటూ గౌరవించారు. మరో వైపు ప్రపంచంలో ఉన్న మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.  
మహిళలు తమ హక్కులను సాధించుకోవాలని, అందుకు ఫైట్ చేయాలని సూచించారు. ఈక్రమంలో చిరంజీవి తన పెద్ద  కూతురు సుష్మిత కొణిదెలకు గుర్తుండిపోయే కాస్ట్లీ గిఫ్ట్ అందించారు. ఈ విషయాన్ని కూతురు సుష్మిత మెగా అభిమానులతో పంచుకుంది. ప్రత్యేకమైన రోజున ప్రత్యేకమైన బహుమతిని అందించిన తండ్రి చిరంజీవికి సుష్మిత హ్రుదపూర్వక ధన్యవాదాలు తెలిపింది. 

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా  చిరంజీవి తన కూతురు సుష్మితకు ఓ విలువైన దుర్గామాత విగ్రహాన్ని బహుమతిగా అందించారు. తాజాగా సుష్మిత ఆ బహుమతిని, తండ్రితో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. పోస్ట్ పెడుతూ.. ‘మహిళలందరికీ హ్యాపీ విమెన్స్ డే! ఇలాంటి బహుమతి అందించినందుకు చాలా థ్యాంక్స్ నాన్న. స్త్రీలను శకివంతులుగా దుర్గాదేవి మాతకంటే ఇంకెలా వర్ణించగలం.’ అంటూ ధన్యవాదాలు తెలుపుతూ నోట్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Latest Videos

మెగాస్టార్ చిరంజీవి కూతురిగా  సుష్మితా కొణిదెల (Sushmita Konidela) తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. మరోవైపు సినీ రంగంలో రాణించేందుకు ప్రొడక్షన్ హౌజ్ ను కూడా ప్రారంభించిన విషయం తెలిసిందే. గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సినిమాలు, వెబ్ సిరీస్ ల నిర్మిస్తూ తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సాధించే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే చిరంజీవి నటించిన ‘ఖైదీ నెం.150’, ‘గాడ్ ఫాదర్’ వంటి చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గానూ వర్క్ చేసింది.  రీసెంట్ గా తను నిర్మాతగా ‘శ్రీదేవి శోభన్ బాబు’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sushmita (@sushmitakonidela)

click me!