‘గ్యాంగ్‌లీడర్’ కి దారి ఇస్తూ.. పవన్ ఆ రెండు రీరిలీజ్ లు కాన్సిల్

By Surya PrakashFirst Published Feb 6, 2023, 1:02 PM IST
Highlights

1991లో విడుదలైన ఈ సెన్సేషనల్ మూవీని ఈ ఏడాది ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు మరో సారి రానుంది. దీంతో మరోసారి వింటేజ్ చిరంజీవిని థియేటర్లలో చూసి ఎంజాయ్ చేసేందుకు అభిమానులు రెడీ అవుతున్నారు. 


చిరంజీవి, విజయశాంతి జంటగా.. విజయ బాపినీడు దర్శకత్వంలో వచ్చిన ‘గ్యాంగ్‌లీడర్’ ఎంత పెద్ద హిట్ సినిమానో తెలిసిందే. ఓ జనరేష్ ని ఈ సినిమా ఊపేసింది. మెగాస్టార్‌ మాస్ ఇమేజ్‌ను పటిష్టం చేసిన  సినిమా ఇది. ‘చెయ్యి చూశావా ఎంత రఫ్ గా ఉందో! రఫ్ ఆడించేస్తాను’ అంటూ మెగాస్టార్ చెప్పే మాస్ డైలాగ్‌లను ప్రేక్షకుల ముందుకు మరోసారి తీసుకురానున్నారు . వివరాల్లోకి వెళితే...

1991లో విజయ బాపినీడు దర్శకత్వంలో శ్యామ్ ప్రసాద్ ఆర్ట్స్ పైన నిర్మించిన సినిమా గ్యాంగ్ లీడర్ .   కమర్షియల్ సినిమా అనే పదానికి కేరాఫ్ అడ్రెస్ లా ఉంటుంది ఈ చిత్రం. బప్పి లహరి ఇచ్చిన సాంగ్స్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. విజయశాంతి, చిరుల లవ్ ట్రాక్… మురళి మోహన్-శరత్ కుమార్-చిరంజీవిల మధ్య బ్రదర్ ఎమోషన్ గ్యాంగ్ లీడర్ సినిమాకి ప్రధాన బలంగా నిలిచాయి. ఈ మూవీలో రావు గోపాల్ రావ్ ప్లే చేసిన నెగటివ్ రోల్ కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.

is my fvt movie. I've been waiting for its Re-Release so long and the day has finally come 😍

Will celebrate Vintage Megastar garu on FEB 11th just like on FDFS back in those days 💥 pic.twitter.com/AasqKABhuB

— Ajay Bhupathi (@DirAjayBhupathi)

అప్పట్లో 100 రోజులు 50 కేంద్రాల్లో ఆడిన గ్యాంగ్ లీడర్ సినిమా 7కోట్ల డిస్ట్రిబ్యుటర్ షేర్ ని రాబట్టింది అంటే గ్యాంగ్ లీడర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. ఈ మూవీ 100 డేస్ వేడుక జరిగిన సమయంలో తీసిన క్రౌడ్ విజువల్స్ ని “అప్పుల అప్పారావు” సినిమాలో వాడుకున్నారు అంటే ఎంత మంది జనాలు 100 డేస్ ఫంక్షన్ కి వచ్చారో ఊహించొచ్చు. చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన గ్యాంగ్ లీడర్ సినిమాని రీరిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 11న గ్యాంగ్ లీడర్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రీరిలీజ్ అవ్వనుంది.  ఫెబ్రవరి 17వరకూ పెద్ద సినిమాలు లేకపోవడం, ఫిబ్రవరి 11న మంచి సినిమాలు రిలీజ్ కాకపోవడంతో ఈ వన్ వీక్ గ్యాప్ ని గ్యాంగ్ లీడర్ సినిమా కాష్ చేసుకునే ఛాన్స్ ఉంది.  

50కిపైగా థియేట‌ర్ల‌లో శ‌త‌దినోత్స‌వాన్ని జ‌రుపుకున్న‌ది. ఈ సినిమాను హిందీలో ఆజ్ కా గూండా రాజ్ పేరుతో రీమేక్ చేశారు. హిందీ రీమేక్‌లో చిరంజీవి హీరోగా న‌టించాడు. బాలీవుడ్‌లో ఈ సినిమా 27 ల‌క్ష‌ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టి సంచ‌ల‌నం సృష్టించింది. ప్ర‌స్తుతం వాల్తేర్ వీర‌య్య స‌క్సెస్‌తో చిరంజీవి జోరుమీదున్నాడు. ఆ స‌క్సెస్ క్రేజ్ గ్యాంగ్ లీడ‌ర్ రీ రిలీజ్‌కు క‌లిసివ‌చ్చే అవ‌కాశం ఉంది.


ఇదిలా ఉంటే...పవన్  కళ్యాణ్  #Badri & #TholiPrema చిత్రాల రీరిలీజ్ లు రెండూ కాన్సిల్ అయ్యాయి.
 

click me!