పఠాన్ నచ్చలేదా? అయితే ఆ పాపకి దిల్ వాలే చూపించండి! షారుక్ ఎపిక్ రియాక్షన్!

By Sambi ReddyFirst Published Feb 6, 2023, 10:54 AM IST
Highlights


షారుక్ ఖాన్ పఠాన్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. కాగా ఆయన ఓ సోషల్ మీడియా పోస్ట్ కి ఎపిక్ రిప్లై ఇచ్చాడు. 
 

వరల్డ్ వైడ్ పఠాన్ ప్రభంజనం కొనసాగుతోంది. 12 రోజులకు గాను పఠాన్ దాదాపు రూ.727 కోట్ల వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు రిపోర్ట్ చేశాయి. నాలుగేళ్ల గ్యాప్ తర్వాత షారుక్ బ్లాక్ బస్టర్ కమ్ బ్యాక్ ఇచ్చారు.అయితే పఠాన్ మూవీ ఓ పాపకు నచ్చలేదట. అభిషేక్ అనే నెటిజన్ ట్విట్టర్ లో తన పాప వీడియో పోస్ట్ చేశారు. సదరు వీడియోలో 'మనం ఏ సినిమా చూశాము?' అని అడిగాడు. పాప 'పఠాన్' అని సమాధానం చెప్పింది. 'నీకు సినిమా నచ్చిందా?' అని అడగ్గా 'లేదు' అని ఆ పాప సమాధానం చెప్పింది. 

ఈ వీడియో షారుక్ దృష్టికి వెళ్ళింది. షారుక్ తనదైన శైలిలో స్పందించారు. ''అయ్యే ఈ పాపకు పఠాన్ మూవీ నచ్చలేదట. నేను ఇంకా బాగా కష్టపడాల్సి ఉంది.  యంగ్ ఆడియన్స్ ని నిరాశ పరచడం పద్ధతి కాదు. ఇది దేశ యువతకు పెద్ద సవాల్. అయితే ఆమెకు దిల్ వాలే దుల్హనియా లేజాయింగే మూవీ చూపించండి. కనీసం రొమాంటిక్ లవ్ చిత్రాలు నచ్చుతాయేమో'' అని ట్వీట్ చేశారు. షారుక్ ట్వీట్ నెటిజెన్స్ ని ఎంతగానో ఆకర్షించింది. ఓ పాప కామెంట్ కి ఆయన క్యూట్ రియాక్షన్ ఆకట్టుకుంది. 

Oh oh!! Have to work harder now. Back to the drawing board. Can’t let the younger audience be disappointed. Desh ke youth ka sawaal hai. PS: Try DDLJ on her please….maybe she is the romantic types….kids u never know! https://t.co/UBpSnLOZrf

— Shah Rukh Khan (@iamsrk)

షారుక్ కెరీర్లో పఠాన్ అరుదైన చిత్రంగా నిలిచిపోనుంది. దశాబ్దకాలంగా హిట్ లేని షారుక్ ఖాన్ తీవ్ర మానసిక ఒత్తిడి ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో ఆయన పరిశ్రమకు దూరమయ్యారు. విరామం తీసుకొని గట్టిగా కమ్ బ్యాక్ ఇవ్వాలని కోరుకున్నారు. కసిగా పఠాన్ మూవీ చేశారు. దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన పఠాన్ ఇండియన్ బాక్సాఫీస్ రికార్డ్స్ తిరగరాస్తుంది. దీపికా పదుకొనె హీరోయిన్ గా నటించగా... జాన్ అబ్రహం విలన్ రోల్ చేశారు. తెలుగులో సైతం పఠాన్ ఆదరణ దక్కించుకుంది. 

పఠాన్ చిత్రాన్ని అనేక వివాదాలు చుట్టుముట్టాయి. ఓ సాంగ్ లో దీపికా కాషాయ రంగు బికినీ ధరించడాన్ని హిందూ సంఘాలు, బీజేపీ వర్గాలు తప్పుబట్టాయి. పఠాన్ చిత్రాన్ని వ్యతిరేకంగా సోషల్ మీడియాలో నెగిటివ్ ట్యాగ్స్ ట్రెండ్ చేశారు. అవాంతరాల మధ్య విడుదలైన పఠాన్ విజయం సాధించింది. విడుదల అనంతరం షారుక్... సినిమాకు కుల మతాలు ఉండవని కామెంట్ చేశారు. 
 

click me!