
మెగా పవర్ స్టార్ చరణ్ 36వ బర్త్ డే సెలెబ్రేషన్స్ లో ఫ్యాన్స్ మునిగి తేలుతున్నారు. సోషల్ మీడియాలో వారం రోజులుగా సందడి చేస్తున్న మెగా ఫ్యాన్స్, భౌతికంగా కూడా అనేక చోట్ల చరణ్ బర్త్ డే వేడుకలు జరుపుకుంటున్నారు. రేపు చరణ్ బర్త్ డే సందర్భంగా, ఆర్ ఆర్ ఆర్ నుండి అల్లూరి సీతారామరాజుగా చరణ్ లుక్ విడుదల చేశారు. విల్లు ఎక్కుపెట్టిన అల్లూరి గెటప్ లో చరణ్ అద్భుతంగా ఉండగా, ఆయన లుక్ కి ప్రసంశలు దక్కుతున్నాయి. కాగా చరణ్ పుట్టిన రోజు సందర్భంగా తండ్రి చిరంజీవి స్పెషల్ బర్త్ డే విషెష్ తెలియజేశారు.
చరణ్ కి విషెష్ చెబుతూ చిరంజీవి ఓ స్పెషల్ వీడియో విడుదల చేశారు. బాల్యంలో చిరంజీవికి చరణ్ గొడుకు పడుతున్న ఫోటో, ప్రస్తుతం షూటింగ్ సెట్స్ లో తనకు గొడ్డుపడుతున్న ఫోటోలు వీడియోలో చిరంజీవి పంచుకున్నారు. అప్పుడు, ఇప్పుడు.. ఎల్లప్పుడూ కేరింగ్ సన్ చరణ్ అంటూ, బర్త్ డే విషెష్ తెలియజేశారు. అద్భుతమైన ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక ఆచార్య మూవీలో చరణ్, చిరంజీవి కలిసి నటిస్తున్నారు. గతంలో చరణ్సినిమాలలో చిరంజీవి క్యామియో రోల్స్ మాత్రమే చేశారు. ఈసారి చిరంజీవి ప్రధానంగా తెరకెక్కుతున్న ఆచార్యలో చరణ్ అరగంట నిడివి కలిగిన కీలక రోల్ చేస్తున్నారు. చరణ్, చిరు మధ్య కాంబినేషన్ సీన్స్ అలరిస్తాయని సమాచారం. దర్శకుడు కొరటాల తెరకెక్కిస్తున్న ఆచార్య సమ్మర్ కానుకగా మే నెలలో విడుదల కానుంది.