అల్లూరిగా చరణ్... ఒరిజినల్ లుక్ లో కేక పుట్టించిన భీమ్ బ్రదర్!

Published : Mar 26, 2021, 04:15 PM IST
అల్లూరిగా చరణ్... ఒరిజినల్ లుక్ లో కేక పుట్టించిన భీమ్ బ్రదర్!

సారాంశం

సరిగ్గా ఏడాది తరువాత రామ్ చరణ్ 36వ బర్త్ డే కానుకగా ఆర్ ఆర్ ఆర్ నుండి మరో అప్డేట్ వచ్చేసింది. అల్లూరి సీతారామరాజు గెటప్ లో రామ్ చరణ్ లుక్ విడుదల చేశారు చిత్ర బృందం. విల్లు ఎక్కుబెట్టి, పంచ కట్టులో అల్లూరిగా చరణ్ లుక్ అద్భుతంగా ఉంది. ఇప్పటి వరకు రామ రాజు పాత్రను ఒరిజినల్ లుక్ కి భిన్నంగా పోలీస్ గెటప్, ప్యాంటు, షర్ట్స్ లో చూపించారు. నేడు ఒరిజినల్ గా అల్లూరి సీతారామరాజు గెటప్ లో చరణ్ ని ప్రెజెంట్ చేశారు.   

గత ఏడాది రామ్ చరణ్ బర్త్ డే కానుకగా విడుదలైన రామరాజు ఫస్ట్ లుక్ టీజర్ ఫ్యాన్స్ తో పాటు పరిశ్రమ వర్గాలను షాక్ కి గురిచేసింది. చరణ్ ఫస్ట్ లుక్ వీడియోలో కండలు తిరిగిన దేహంతో, ఆయన చేసిన సాహసాలు గూస్ బంప్స్ కలిగించాయి. చరణ్ పాత్రను ఎలివేట్ చేస్తూ, ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ టీజర్ కి మరో ఆకర్షణగా నిలిచింది. నాటు తెలంగాణా యాసలో రామరాజు వీరత్వాన్ని తెలియజేస్తూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్ అబ్బురపరిచాయి. 

సరిగ్గా ఏడాది తరువాత రామ్ చరణ్ 36వ బర్త్ డే కానుకగా ఆర్ ఆర్ ఆర్ నుండి మరో అప్డేట్ వచ్చేసింది. అల్లూరి సీతారామరాజు గెటప్ లో రామ్ చరణ్ లుక్ విడుదల చేశారు చిత్ర బృందం. విల్లు ఎక్కుబెట్టి, పంచ కట్టులో అల్లూరిగా చరణ్ లుక్ అద్భుతంగా ఉంది. ఇప్పటి వరకు రామ రాజు పాత్రను ఒరిజినల్ లుక్ కి భిన్నంగా పోలీస్ గెటప్, ప్యాంటు, షర్ట్స్ లో చూపించారు. నేడు ఒరిజినల్ గా అల్లూరి సీతారామరాజు గెటప్ లో చరణ్ ని ప్రెజెంట్ చేశారు. 

దర్శకధీరుడు రాజమౌళి చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజుల జీవితం ఆధారంగా కాల్పనికత జోడించి ఆర్ ఆర్ ఆర్ తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ మూవీలో కొమరం భీమ్ గా నటిస్తున్నారు. చరణ్ కి జంటగా సీత పాత్రలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తున్నారు. మరో బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్ గణ్ ఓ కీలక రోల్ చేస్తుండగా, అతని భార్య పాత్రలో శ్రీయా.. క్యామియో రోల్ చేస్తున్నారు. 

నిర్మాత డి వి వి దానయ్య భారీ బడ్జెట్ తో ఆర్ ఆర్ ఆర్ తెరకెక్కిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అక్టోబర్ 13న ఐదు భాషలలో ఆర్ ఆర్ ఆర్ భారీ ఎత్తున విడుదల కానుంది. 
 
PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: అలాంటి వాళ్ళు కప్ గెలిచినట్లు చరిత్రలో లేదు, ఈసారి బిగ్ బాస్ టైటిల్ ఎవరిదంటే ?
Kartik Aaryan: చెల్లి పెళ్లి వేడుకలో హంగామా చేసిన యంగ్ హీరో, సందడి మొత్తం అతడిదే.. వైరల్ ఫోటోస్