KrishnamRaju Birthday: రెబల్ స్టార్ కి చిరంజీవి బర్త్ డే విషెస్

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 20, 2022, 04:31 PM IST
KrishnamRaju Birthday: రెబల్ స్టార్ కి చిరంజీవి బర్త్ డే విషెస్

సారాంశం

తెలుగు చిత్ర పరిశ్రమలో రెబల్ స్టార్ గా తనదైన ముద్ర వేసుకున్న కృష్ణంరాజు నేడు 82వ వసంతంలోకి అడుగుపెట్టారు. కృష్ణంరాజు తన విలక్షణమైన రెబల్ యాటిట్యూడ్ తో టాలీవుడ్ లో ప్రముఖ హీరోగా కొనసాగారు.

తెలుగు చిత్ర పరిశ్రమలో రెబల్ స్టార్ గా తనదైన ముద్ర వేసుకున్న కృష్ణంరాజు నేడు 82వ వసంతంలోకి అడుగుపెట్టారు. కృష్ణంరాజు తన విలక్షణమైన రెబల్ యాటిట్యూడ్ తో టాలీవుడ్ లో ప్రముఖ హీరోగా కొనసాగారు. దశాబ్దాల కాలం పాటు ఆయన క్రేజ్ కొనసాగింది. ఇప్పటికి కృష్ణంరాజు డైలాగులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. 

కృష్ణం రాజు పుట్టినరోజు సందర్భంగా అభిమానుల నుంచి సినీ ప్రముఖుల నుంచి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా కృష్ణంరాజుకి మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే విషెస్ తెలియజేశారు. 

కృష్ణం రాజుని చిరంజీవి సోదర సమానుడిగా అభివర్ణించారు. 'సోదరసమానుడు కృష్ణం రాజుగారికి జన్మదిన శుభాకాంక్షలు. తెలుగు చిత్రపరిశ్రమకు తొలి రెబల్ స్టార్, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా కేంద్ర మంత్రిగా అడుగుపెట్టిన ప్రతి రంగంలో తనదైన ముద్ర వేశారు. ఆయన ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు హాయిగా ఉండాలని కోరుకుంటున్నాను' అంటూ చిరంజీవి ట్వీట్ చేసారు. 

చిరంజీవి, కృష్ణం రాజు మంచి స్నేహితులు. ఇద్దరూ మొగల్తూరు ప్రాంతానికి చెందినవారే. కెరీర్ ఆరంభంలో చిరంజీవి, కృష్ణం రాజు అనేక చిత్రాల్లో కలసి నటించారు. పులి బెబ్బులి, ఆడవాళ్లు మీకు జోహార్లు,  మనవూరి పాండవులు లాంటి చిత్రాల్లో వీరిద్దరూ కలసి నటించారు. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ తరపున కృష్ణం రాజు పోటీ చేశారు కూడా. 

 

 

PREV
click me!

Recommended Stories

BMW Teaser: 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ రివ్యూ.. వరుస డిజాస్టర్లతో రూటు మార్చిన రవితేజ, రొమాన్స్ షురూ
Missterious Review: 'మిస్‌టీరియస్' మూవీ రివ్యూ.. ట్రైయాంగిల్ లవ్ స్టోరీలో మిస్టరీ ఆకట్టుకుందా, తేలిపోయిందా ?