షన్ముఖ్ జస్వంత్ య్యూటూబ్ లో చిన్న స్థాయి హీరో. ఇంజినీరింగ్ చదివిన షన్ముఖ్ నటనపై తనకున్న ఆసక్తితో య్యూటూబర్ గా మారాడు. కొన్నేండ్లుగా తను ఫన్నీ వీడియోలు చేస్తూ తనకంటూ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. తాజాగా మరో వెబర్ సిరీస్ తో మనముందుకు రానున్నాడు.
షన్ముష్ జస్మంత్ చిన్నచిన్న ఫన్నీ వీడియోలతో తన కేరీర్ ని ప్రారంభించాడు. 2013 నుంచి వరుసగా తనకు తోచిన, జనాలను నవ్వించ గలిగే కంటెంట్ తో ఫన్నీ వీడియోలను తీసి యూట్యూబ్ లో అప్ లోడ్ చేయడం ప్రారంభించాడు. అప్పటి నుంచి కొద్దికొద్దిగా పాపులర్ అవుతూ ట్రెండ్ లోకి వచ్చాడు.
కొత్త కొత్త కంటెంట్ తో జనాలు నవ్విస్తూనే ఒక మేసేజ్ ఎలమెంట్ ఉండేలా చూసుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకతను నిలుపుకున్నాడు షన్ముఖ్ జస్వంత్. కాగా ‘ది సాఫ్ట్ వేర్ డెవలపర్’ ‘సూర్య’ వంటి వెబ్ సిరీస్ లతో బెస్ట్ యూట్యూబర్ గా, నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. అంతకుముందు వరుసగా సోషల్ ఎలమెంట్స్ ద్వారా ఫన్నీ వీడియోలు, షార్ట్ వీడియోస్, కవర్ సాంగ్స్ చేసి మంచి గుర్తింపు పొందాడు.
ఎప్పటికప్పుడు తన నటనలో మెళకువలు తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్న జస్వంత్ పలు అవార్డులు కూడా అందాయి. పలు సంస్థల నుంచి ప్రశంస పత్రాలు కూడా పొందారు. ‘వైవా’ షార్ట్ ఫిల్మ్ అప్పటి నుంచి తను నటపై ఆసక్తి చూపుతున్నాడు. ఇటీవల వచ్చిన ‘సూర్య’ వెబ్ సిరీస్ లో మాత్రం షన్ముఖ్ నటనకు యూత్ మొత్తం ఫిదా అయ్యారు.
తాను తీసిన నాలుగు ఎపిసోడ్ లను మిలియన్ల వ్యూస్ తో విజయవంతం చేశారు. ఈ క్రేజ్ చూసిన ‘బిగ్ బాస్’ టీం షన్ముఖ్ ను ఆహ్వానించింది. దీంతో షన్ముఖ్ ‘బిగ్ బాస్ 5’కి ఎంట్రీ ఇచ్చాడు. చివరిగా రన్నరప్ గా నిలిచాడు. అప్పుడూ షన్ముఖ్ కు చాలా మంది మద్దతుగా నిలిచారు. బిగ్ బాస్ నుంచి వచ్చాక షన్ముఖ్ కు మంచి ఆఫర్లు వస్తున్నట్టు తెలుస్తోంది.
ఏదేమైనా, ఎన్ని ఆఫర్లు వచ్చినా ముందు మరో మంచి వెబ్ సిరీస్ తీయాలనే ఆలోచనలోనే షన్ముఖ్ ఉన్నారు. ఈ మేరకు త్వరలో మరో సిరీస్ తో రానున్నట్టు ఆయనే తన సోషల్ మీడియా ఖాతాలో తెలియజేశారు. ‘ఏజెంట్ ఆనంద్ సంతోష్’ పేరు గల వెబ్ సిరీస్ చేయనున్నట్టు తెలిపారు జస్వంత్. ఇందుకు సంబంధించిన టైటిల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. అయితే సూర్యలో కొంతమేరకు ఎమోషన్ డ్రామా పండించారు.
ఈ సారి మాత్రం తప్పకుండా కడుపుబ్బా నవ్వించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. టెక్షన్స్ అన్నీ పోయేలా నవ్విస్తామని ప్రామిస్ చేస్తున్నాడు. ఈ సిరీస్ చూస్తున్నంత సేపు తన పేరు ప్రేక్షకుల మొహంలో ఉంటుందని పేర్కొన్నాడు. ఇక దీప్తి సునైనాతో రిలేషన్ లో ఉన్నా, ఇటీవలే విడిపోయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎవరి లైఫ్ లో వారు మూవ్ అవుతామని చెప్పుకొచ్చారు.