హాస్య బ్రహ్మకి చిరు బర్త్ డే విషెస్‌.. ఇంటికెళ్లి మరీ గిఫ్ట్ తో సర్‌ప్రైజ్‌

Published : Feb 01, 2023, 03:22 PM ISTUpdated : Feb 01, 2023, 03:28 PM IST
హాస్య బ్రహ్మకి చిరు బర్త్ డే విషెస్‌.. ఇంటికెళ్లి మరీ గిఫ్ట్ తో సర్‌ప్రైజ్‌

సారాంశం

ప్రముఖ తెలుగు హాస్య నటుడు బ్రహ్మానందం నేడు తన పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ ఆయనకు ప్రత్యేకంగా బర్త్ డే విషెస్‌ తెలిపారు. 

తెలుగు తెర హాస్య బ్రహ్మ.. నవ్వులతో తెలుగు చిత్ర పరిశ్రమని శాషించిన బ్రహ్మానందం నేడు(బుధవారం) 67వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. దాదాపు వెయ్యికిపైగా చిత్రాల్లో నటించారు. గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లోకి ఎక్కారు. దాదాపు నాలుగున్నర దశాబ్దాలపాటు తెలుగు చిత్ర పరిశ్రమని ఏలారు బ్రహ్మానందం. ఇప్పుడు ఆయన జోరు తగ్గింది. ఆయన కూడా సెలక్టీవ్‌గా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు బర్త్ డే సందర్భంగా బ్రహ్మానందానికి ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు చిరంజీవి. అంతేకాదు గిఫ్ట్ తో సర్‌ప్రైజ్‌ చేశారు. 

`నాకు తెలిసిన బ్రహ్మానందం అత్తిలిలో ఒక లెక్చరర్‌, ఈ రోజున బ్రహ్మానందం ప్రపంచంలోనే అత్యధిక చిత్రాల్లో నటించి, గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్ రికార్డ్స్ లో కెక్కిన ఒక గొప్ప హాస్యనటుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. కామెడీకి నిలువెత్తు నిదర్శనం. అతను కామెడీ చేయాల్సిన అవసరం లేదు. అతని మొహం చూస్తేనే హాస్యం వెల్లివిరుస్తుంది. పొట్ట చెక్కలవుతుంది. ఇలాంటి బ్రహ్మానందానికి హృదయ పూర్వక శుభాభినందనలు. 

బ్రహ్మానందం ఇలానే జీవితాంతం, నవ్వుతూ, పది మందిని నవ్విస్తూ ఉండాలని, బ్రహ్మానందంకి మరింత బ్రహ్మాండమైన భవిష్యత్‌ ఉండాలని, తన పరిపూర్ణ జీవితం ఇలాగే బ్రహ్మానందకరంగా సాగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, నా జన్మదిన శుభాకాంక్షలు` అని ట్వీట్‌ చేశారు చిరంజీవి. ఈ సందర్భంగా ఆయనకు వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని బహుమతిగా ఇచ్చారు. అయితే చిరంజీవి స్వయంగా ఇంటికెళ్లి మరి విషెస్‌ తెలియజేయడం విశేషం. 

చిరుతోపాటు జబర్దస్త్ కమెడియన్లు కూడా ఉన్నారు. ముక్కు అవినాష్‌, రాంప్రసాద్‌, రాకెట్ రాఘవ, రచ్చ రవి వంటి యంగ్ కమెడియన్స్ ఉండటం విశేషం. వీరంతా దిగిన ఫోటోలను చిరంజీవి ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. చిరంజీవి సినిమాల్లో బ్రహ్మానందం ట్రాక్‌ చాలా పాపులర్‌. ఎన్నో సినిమాల్లో ఈ ఇద్దరు కలిసి చేసిన కామెడీ తెలుగు ఆడియెన్స్ ని కడుపుబ్బ నవ్వించింది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Ustaad Bhagat Singh: ప్రోమోతోనే దుమ్ములేపుతున్న `దేఖ్‌ లేంగే సాలా` సాంగ్‌.. పవన్‌ కళ్యాణ్‌ మేనియా స్టార్ట్
2025 Top 5 Heroes: 1000 కోట్లతో టాప్‌లో ఉన్న నటుడు ఇతనే.. రిషబ్‌, మోహన్‌ లాల్‌, విక్కీ, అక్షయ్‌లకు ఝలక్‌