Sai Pallavi: ఈ జీవితానికి ఆ మూడు చాలంటున్న సాయి పల్లవి! 

By Sambi ReddyFirst Published Feb 1, 2023, 2:33 PM IST
Highlights


సోషల్ మీడియా పోస్ట్స్ అరుదుగా పెట్టే సాయి పల్లవి ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. అలాగే తన లేటెస్ట్ ఫోటో షేర్ చేశారు.
 

సాయి పల్లవి కొత్త మూవీ ప్రకటన చేయాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తమిళ అమ్మాయి అయిన సాయి పల్లవి తెలుగులో భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ తెచ్చుకుంది. ఫిదా, ఎంసీఏ, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ చిత్రాల్లో సాయి పల్లవి చేసిన పాత్రలు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాయి. సాయి పల్లవి పాత్రలు చాలా పవర్ఫుల్ గా ఉంటాయి. కథలో ప్రాధాన్యం ఉంటేనే ఆమె నటిస్తారు. అదే ఆమెకు అభిమానగణాన్ని తెచ్చిపెట్టింది. 

విరాటపర్వం మూవీ తర్వాత సాయి పల్లవి మరో మూవీ చేయలేదు. తమిళ చిత్రం గార్గి చేశారు. అది తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. విరాటపర్వం సైతం పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు. శ్యామ్ సింగరాయ్ మూవీ అనంతరం ఆమెకు హిట్ పడలేదు. అయినపప్పటికీ ఆమెకు డిమాండ్ తగ్గలేదు. దర్శక నిర్మాతలు ఆమె కోసం ఎదురుచూస్తున్నారు. సాయి పల్లవి మాత్రం ఒక్క సినిమా కూడా ప్రకటించలేదు. 

ఈ క్రమంలో ఆమె చిత్రాలు మానేశారంటూ కొన్ని పుకార్లు తెరపైకి వచ్చాయి. ఆమె వైద్య వృత్తిలో కొనసాగాలి అనుకుంటున్నారని, పెళ్లి చేసుకోబోతున్నారంటూ భిన్న కథనాలు వినిపించాయి. అయితే సినిమాలు వదిలేయలేదు. మంచి పాత్రల కోసం ఎదురు చూస్తున్నానని చెప్పి పుకార్లకు చెక్ పెట్టింది. అల్లు అర్జున్, అజిత్, సూర్య ఇలా పలువురు స్టార్ హీరోలతో సాయి పల్లవి నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అధికారిక సమాచారం మాత్రం లేదు. 

ఇదిలా ఉంటే సాయి పల్లవి సోషల్ మీడియాలో అరుదుగా కనిపిస్తారు. తాజాగా సాయి పల్లవి ఇంస్టాగ్రామ్ వేదికగా ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. నవ్వులు, ఆశలు, కృతఙ్ఞతలు అంటూ కామెంట్ పోస్ట్ చేసింది. హ్యాపీ లైఫ్ కి అవి మూడు ఉంటే చాలని ఆమె పరోక్షంగా చెప్పారు. ఈ తరం హీరోయిన్స్ లో సాయి పల్లవి ప్రత్యేకం అని నిరూపించుకున్నారు. 
 

click me!