చిరు గట్టిగానే క్లాస్ పీకారట..అందుకే రామ్ చరణ్

By Surya PrakashFirst Published Aug 26, 2020, 7:49 AM IST
Highlights

అనుభవం ఉన్న చిరంజీవి ఈ విషయం చాలా స్పష్టంగా తెలుసు. కెరీర్ ఊపందుకున్నప్పుడే పగ్గాలు సరిగ్గా పట్టుకుని గమ్యం చేరాలి. ప్రక్క చూపు చూస్తే...కెరీర్ గుర్రం దారి తప్పుతుంది. తను కెరీర్ లో ఎప్పుడూ బర్డెన్స్ పెట్టుకోలేదు.

రామ్ చరణ్ ఇప్పుడిప్పుడే సరైన ట్రాక్ లో పడ్డారు. ధృవ, రంగస్దలం, ఆర్ ఆర్ ఆర్ ఇలా వరసపెట్టి ప్రతిష్టాత్మకైన ప్రాజెక్టులు చేస్తున్నారు. ఇన్నాళ్లు ఒకెత్తు..ఇప్పుడు ఒకెత్తు. అనుభవం ఉన్న చిరంజీవి ఈ విషయం చాలా స్పష్టంగా తెలుసు. కెరీర్ ఊపందుకున్నప్పుడే పగ్గాలు సరిగ్గా పట్టుకుని గమ్యం చేరాలి. ప్రక్క చూపు చూస్తే...కెరీర్ గుర్రం దారి తప్పుతుంది. తను కెరీర్ లో ఎప్పుడూ బర్డెన్స్ పెట్టుకోలేదు. కేవలం నటన మీదే కాన్సర్టేట్ చేసారు. మిగతా విషయాలు అల్లు అరవింద్, నాగబాబు చూసుకుంటూ వచ్చారు. అదే విషయాన్ని తన కుమారుడుకి చెప్పారట చిరంజీవి.

నువ్వు ఇప్పుడున్న కెరీర్ పరుగులో కేవలం నీ దృష్టి నటన మీదే పెట్టు...నిర్మాతగా అనవసరమైన బర్డన్లు, టెన్షన్స్ పెట్టుకోకు అని చెప్పారట. రామ్ చరణ్ కన్వీన్స్ చేయటానికి ప్రయత్నించినా..రెండు పడవల మీద ప్రయాణం వద్దని క్లాస్ పీకారట. దాంతో ఇక నుంచి సినీ నిర్మాణాలకు దూరంగా ఉండాలని రామ్ చరణ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. 
  
తన తండ్రి కమ్ బ్యాక్ చిత్రం ఖైధీ నెంబర్ 150 , డ్రీమ్ ప్రాజెక్టు సైరా నరసింహారెడ్డి, ఇప్పుడు ఆచార్య సినిమాల నిర్మాణంలో రామ్ చరణ్ పాలు పంచుకున్నారు. ముఖ్యంగా సైరా నరసింహారెడ్డి విషయంలో చాలా టెన్షన్ పడ్డారని చెప్తారు. చివరకు ఆ సినిమా నష్టాలు మిగిల్చింది. ఇప్పుడు ఆచార్య క్రేజీ ప్రాజెక్టు అయినా, నిర్మాతగా దానిపై దృష్టి పెట్టడం ఓ రకమైన ఒత్తిడి క్రియేట్ చేస్తుంది. ఇది గమనించిన చిరు..దాన్నుంచి రిలీవ్ అవమని చెప్పారట. 

click me!