నిజాలు నిస్సిగ్గుగా చెప్పేస్తున్న పూరి...వాళ్లకు నచ్చడం లేదట..!

By Satish ReddyFirst Published Aug 26, 2020, 7:44 AM IST
Highlights

 దర్శకుడు పూరి జగన్నాధ్ మ్యూసింగ్స్ పేరుతో కొన్ని ఆడియో ఫైల్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.పూరి మ్యూసింగ్స్ కి మంచి ఆదరణ దక్కుతుంది.  ఐతే పూరి కొన్ని సున్నితమైన అంశాలను బాహాటంగా చర్చిండం కొందరికి ఇబ్బంది కలిగించేలా ఉంది. సాంప్రదాయవాదులు పూరి మ్యూసింగ్స్ పట్ల అసహనంగా ఉన్నారు.   
 

డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఫిలాసఫర్ అయిపోయారు. తన మనసులోని భావాలను, జ్ఞానాన్ని సినిమాల ద్వారా చెప్పడం సాధ్యం కావడం లేదునుకున్నారేమో లేక అన్ని విషయాలు కవర్ కావడం లేదు అనుకున్నారేమో కానీ మ్యూసింగ్స్ పేరుతో జీవితసారం  తనదైన శైలిలో చర్చించారు. ఆయన చెబుతున్న విషయాలు నిజమేగా అనిపిస్తున్నాయి. పూరి మ్యూసింగ్స్ అద్భుతం అని ఇప్పటికే కొందరు ప్రముఖులు పొగిడేశారు. ఐతే పూరి కొన్ని సున్నితమైన అంశాలను బాహాటంగా చర్చిండం కొందరికి ఇబ్బంది కలిగించేలా ఉంది. సాంప్రదాయవాదులు పూరి మ్యూసింగ్స్ పట్ల అసహనంగా ఉన్నారు. 

సెక్స్ విషయంలో ఆడవాళ్లను సంతృప్తి పరచడం ఏ మగవాడి వల్ల కాదని చెప్పిన పూరి, మగాళ్లు ఆ విషయంలో వీక్ అని చెప్పారు. వాస్తవం తెలిసేవరకు పోటుగాళ్లు అనుకునే మగాళ్లు ఆ సెక్స్ విషయంలో  ఆడవాళ్లకు దండం పెట్టాల్సిందే. పడక గదికి వెళ్లాలంటే భయపడతారని అన్నారు. పూరి చెప్పిన ఈ పాయింట్ అందరి విషయంలో ఒకలా ఉండకపోవచ్చు. అలాగే ఆయన పరోక్షంగా ఆడవారిని కామపిశాచులుగా చిత్రీకరించినట్లు ఉందని కొందరి వాదన. బెడ్ రూమ్ లో భార్య భర్తల మధ్య శృంగారం కేవలం శారీరకం మాత్రమే కాదు, మానసికం కూడా. కాబట్టి సంతృప్తి అనేది మానసిక భావన,అప్పటి పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. 

అలాగే పూరి సెక్స్ విషయంలో మన పూర్వీకులు చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నారని, మనకంటే వేల సంవత్సరాల క్రితమే సెక్స్ పట్ల వాళ్ళు పూర్తి అవగాహన కలిగివున్నారని చెప్పారు. శృంగారాన్ని మనస్ఫూర్తిగా నచ్చిన విధంగా అనుభవించాలి అన్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా, బ్యాంకుకు వెళ్లిన ప్రతిసారి తన టీమ్ లో కుర్రాళ్లు అక్కడి అమ్మాయిలతో సెక్స్ కోరికలు తీర్చుకుంటారు అన్నారు. ఇది పూర్తిగా వ్యతిరేకించే అంశమే. ఆయన ప్రత్యక్షం గానే ఇక్కడ వ్యభిచారాన్ని, విచ్చలవిడి శృంగారాన్ని ప్రోత్సహిస్తునట్లుగా ఉంది. ఈ విషయాలలో పూరి పై సాంప్రదాయవాదులు గుర్రుగా ఉన్నారు.  

click me!