Peddi : పెద్ది సెట్‌లో అసలు పెద్దలు.. చిరంజీవి, సుకుమార్ సర్‌ప్రైజ్, వీడియో వైరల్

Published : May 09, 2026, 08:44 AM IST
Chiranjeevi and Sukumar Surprise Ram Charan

సారాంశం

మెగాస్టార్ చిరంజీవి, 'పుష్ప' డైరెక్టర్ సుకుమార్.. రామ్ చరణ్ నటిస్తున్న 'పెద్ది' సినిమా సెట్‌కు సర్‌ప్రైజ్ విజిట్ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఒక స్పెషల్ బిహైండ్-ది-సీన్స్ (BTS) వీడియోను మూవీ టీమ్ చేసింది. 

రామ్ చరణ్ నటిస్తున్న 'పెద్ది' సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ఈ సినిమా టీమ్ ఒక స్పెషల్ BTS వీడియోను రిలీజ్ చేసి, అభిమానుల్లో క్యూరియాసిటీని మరింత పెంచేసింది. ఈ వీడియోలో మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ సుకుమార్ 'పెద్ది' సెట్‌ను విజిట్ చేసిన సీన్స్ ఉన్నాయి.

ఈ వీడియోను షేర్ చేస్తూ 'పెద్ది' చిత్ర బృందం, "మా మనసుకు దగ్గరైన కొన్ని సంతోషకరమైన క్షణాలు ఇవి. మెగాస్టార్ చిరంజీవి గారు, డైరెక్టర్ సుకుమార్ గారు 'పెద్ది' షూటింగ్‌కు వచ్చారు. 'పెద్ది' సినిమా 2026, జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. జూన్ 3న ప్రీమియర్ షోలు ఉంటాయి. ట్రైలర్ గురించి త్వరలోనే అప్‌డేట్ ఇస్తాం," అని రాసుకొచ్చింది.

రామ్ చరణ్ కూడా ఈ BTS వీడియోను తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. "'పెద్ది' సెట్‌లో ఒరిజినల్ పెద్ది. #Throwback," అని క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియోలో, చిరంజీవి, సుకుమార్ 'పెద్ది' టీమ్‌తో మాట్లాడుతున్నట్లు చూడొచ్చు. రామ్ చరణ్ కూడా తన క్యారెక్టర్ గెటప్‌లోనే ఉండి, వారిద్దరితో చర్చిస్తూ కనిపించారు.

 

'పెద్ది'లో సుకుమార్ పాత్ర ఏంటి?

టీమ్ ఇచ్చిన ప్రెస్ రిలీజ్ ప్రకారం, 'పెద్ది' సినిమాలో డైరెక్టర్ సుకుమార్ పాత్ర చాలా కీలకమైనది. కథాదశ నుంచి హీరో ఎంపిక, మ్యూజిక్ డైరెక్షన్, సినిమాలోని ప్రతి క్రియేటివ్ నిర్ణయంలో సుకుమార్ భాగమయ్యారు. అంతేకాదు, ఆయన షూటింగ్ సెట్స్‌కు వస్తూ తెరవెనుక అన్నీ చూసుకున్నారు. ఎడిటింగ్‌లో కూడా కూర్చొని, తన శిష్యుడైన బుచ్చి బాబు సానా విజన్ స్క్రీన్‌పై అద్భుతంగా వచ్చేలా చూసుకున్నారని మూవీ టీమ్ వెల్లడించింది. 

'పెద్ది' లో ఎవరెవరు? 

బుచ్చి బాబు సనా కథ రాసి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ హీరోగా నటిస్తుండగా.. జాన్వీ కపూర్ ఆయన జంటగా కనిపించబోతోంది. వీరితో పాటు కన్నడ స్టార్ హీరో  శివ రాజ్‌కుమార్,  దివ్యేందు శర్మ, జగపతి బాబు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ సహ-నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా 2026 జూన్ 4న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode: స్వప్న చెంప పగలకొట్టిన కావేరి- ఒక్కటైన కాశీ, స్వప్న- అంతా నటనేనా?
Jagapathi Babu: జగపతి బాబు ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా? జగ్గూభాయ్ లవ్ స్టోరీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఏంటంటే?