సమంత టాక్‌షో కోసం చిరు, బన్నీ, రౌడీ, మిల్కీ బ్యూటీ, రష్మిక

Published : Nov 06, 2020, 08:54 PM ISTUpdated : Nov 06, 2020, 10:35 PM IST
సమంత టాక్‌షో కోసం చిరు, బన్నీ, రౌడీ, మిల్కీ బ్యూటీ, రష్మిక

సారాంశం

ఈ టాక్‌ షో విశేషాలను పంచుకున్నారు సమంత. మరోవైపు `ఆహా` నిర్వహకుల్లో ఒకరైన అల్లు అరవింద్‌ సైతం పలు ఆసక్తికర విషయాలను తెలిపారు. అయితే ఇందులో టాలీవుడ్‌ టాప్‌ సెలబ్రిటీలు పాల్గొనబోతుండటం ఆసక్తిని రేకెత్తిస్తుంది. 

ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ `ఆహా` లో సమంత హోస్ట్ గా `సామ్‌జామ్‌` టాక్‌ షో నిర్వహిస్తున్నారు. ఇది ఈ నెల 13న ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఈ టాక్‌ షో విశేషాలను పంచుకున్నారు సమంత. మరోవైపు `ఆహా` నిర్వహకుల్లో ఒకరైన అల్లు అరవింద్‌ సైతం పలు ఆసక్తికర విషయాలను తెలిపారు. అయితే ఇందులో టాలీవుడ్‌ టాప్‌ సెలబ్రిటీలు పాల్గొనబోతుండటం ఆసక్తిని రేకెత్తిస్తుంది. 

ఫస్ట్ టైమ్‌ సమంత వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న ఈ టాక్‌ షోలో మెగాస్టార్‌ పాల్గొనబోతుండటం విశేషం. మెగాస్టార్‌తోపాటు స్టయిలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, క్రేజీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ, స్టార్‌ హీరోయిన్లు తమన్నా, రష్మిక మందన్నా, క్రీడాకారులు సైనా నెహ్వాల్‌, కశ్యప్‌ వంటి వారు కూడా ఈ టాక్‌ షోలో పాల్గొనబోతున్నట్టు అల్లు అరవింద్‌, నందిని రెడ్డి తెలిపారు. 

అయితే ఈ షో డిజైన్‌ కోసం `కౌన్‌ బనేగా కరోడ్‌పతి`, `కాఫీ విత్‌ కరణ్‌` వంటి వాటిని డిజైన్‌ చేసిన టాప్‌ టీమ్‌ పనిచేసిందట. సమంత ఆలోచనలను, సమాజాన్ని ప్రతిబింబించేలా దీన్ని డిజైన్‌ చేసినట్టు తెలిపారు. దక్షిణాదిలోనే ఇలాంటి షో చూడలేదనే విధంగా ఈ షో ఉంటుందని అల్లు అరవింద్‌ తెలిపారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bharani: మూడో సీజన్ నుంచి అడుక్కుంటున్నారు, నాగబాబు వల్ల బిగ్ బాస్ ఆఫర్ రాలేదు..మొత్తం రివీల్ చేసిన భరణి
Nayanam Review:తండ్రి వయసు వ్యక్తితో పెళ్లి, భర్తను చింపేసిన భార్య వరుణ్ సందేశ్ ‘నయనం’ ఎలా ఉంది?