నాతో ఎంజాయ్‌మెంట్‌ మామూలుగా ఉండదు.. సామ్‌జామ్‌ అంటోన్న సమంత

Published : Nov 06, 2020, 08:07 PM IST
నాతో ఎంజాయ్‌మెంట్‌ మామూలుగా ఉండదు.. సామ్‌జామ్‌ అంటోన్న సమంత

సారాంశం

సమంత.. తాజాగా ఓ టాక్‌ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నట్టు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా దాన్ని అధికారికంగా ప్రకటించారు. `సామ్‌జామ్‌` పేరుతో ఈ టాక్‌ షో సాగనుందట. ఈ విషయాన్ని సమంత పేర్కొంటూ ఓ వీడియోని సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది. 

సమంత.. తాజాగా ఓ టాక్‌ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నట్టు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా దాన్ని అధికారికంగా ప్రకటించారు. `సామ్‌జామ్‌` పేరుతో ఈ టాక్‌ షో సాగనుందట. ఈ విషయాన్ని సమంత పేర్కొంటూ ఓ వీడియోని సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది. `నాతో ఎంజాయ్‌మెంట్‌ మామూలుగా ఉండదు` అని పేర్కొంటూ ఈ వీడియోని షేర్‌ చేస్తుంది. ఆద్యంతం అల్లరిగా సాగేలా ఉన్న వీడియో ఆకట్టుకుంటుంది. 

ఈ టాక్‌ షో చాలా డిఫరెంట్‌గా ఉండబోతుందట. సమాజంలోని సమస్యల గురించి ప్రశ్నించడం కూడా ఉంటుంది. ప్రతిభని ఎంకరేజ్‌ చేయడం వంటి డిఫరెంట్‌ కాన్సెప్ట్ తో రూపొందిస్తున్నట్టు నిర్వహకులు తెలిపారు. ఇది ఈ నెల 13న దీపావళి స్పెషల్‌గా ప్రసారం కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో సమంత, అల్లు అరవింద్‌, నందిని రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

సమంత మాట్లాడుతూ, ఇటీవల కాలంలో ప్రజలు చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. అందులో ఎవరినీ తప్పుపట్టలేం. మనతోపాటు మన చుట్టూ ఉన్న వాళ్ళు, వాళ్ల ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ కాలం నాకు ఒక గొప్ప  లెర్నింగ్‌ ప్రాసెస్‌. `సామ్‌ జామ్‌` షో చాలా పెద్ద ఛాలెంజ్‌. దీంతో పోల్చితే యాక్టింగ్‌ చాలా సులభమనిపిస్తుంది. హోస్టింగ్‌ సులభం కాదు. నాకు ఒక ఎక్స్ టెన్షన్‌లాంటిది ఈ షో` అని పేర్కొంది. 

ఇంకా స్పందిస్తూ, `ఇది నాకు చాలా హ్యాపీనిస్తుంది. ఇలాంటి షో చేయాల్సిన అవసరం ఉందని చెప్పి సవాల్‌కి రెడీ అయ్యాను. `బిగ్‌బాస్‌4`కి గెస్ట్ గా హోస్టింగ్‌ చేయడం మామ నిర్ణయం. ఆ షో చేసే సమయంలో నిద్ర పట్టలేదు. చాలా హార్డ్ వర్క్ చేశాను. ఓ సవాల్‌గా తీసుకుని చేశా. `సామ్‌ జామ్‌` కేవలం టాక్‌ షో మాత్రమే కాదు, సమాజంలోని చాలా సమస్యల గురించి చర్చిస్తాం. ప్రతిభని ఎంకరేజ్‌ చేస్తాం` అని తెలిపింది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Akhanda 2 Collections: అఖండ 2 మూవీ 10 రోజుల కలెక్షన్లు.. నెగటివ్‌ టాక్‌తోనూ క్రేజీ వసూళ్లు.. ఎంత నష్టమంటే
Bharani: మూడో సీజన్ నుంచి అడుక్కుంటున్నారు, నాగబాబు వల్ల బిగ్ బాస్ ఆఫర్ రాలేదు..మొత్తం రివీల్ చేసిన భరణి