
అయితే ఈ సినిమాకు పీక్ లెవెల్ హైప్స్ తీసుకురావాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నారని టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా చెప్పుకుంటున్నారు. సూపర్ స్టార్ రజనీ ‘కబాలి’కి మించి ‘ఖైదీ నం 150’కి ప్రచారం రావాలని, వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దానిలో భాగంగానే సినిమా రిలీజ్ డేట్‌ను కూడా ముందుకు జరిపారని, దాదాపు 2017, జనవరి 11న రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లను రికార్డు స్థాయిలో బ్లాక్ చేయాలని బయ్యర్లకు ఆదేశాలు వెళ్లాయనేది ఇండస్ట్రీ టాక్.
ఈ సినిమాతో వచ్చే క్రేజ్‌ని 2019 ఎన్నికల్లో ఉపయోగించుకోవాలనేది చిరంజీవి ప్లాన్ అని, అంతేగాక ఆ ఎన్నికల్లో తమ్ముడి జనసేన పార్టీ తరఫున చిరు పోటీ చేస్తారని, అందుకే పవన్ స్వయంగా ఈ సినిమా వ్యవహారాల్లో రహస్యంగా పాల్గొంటున్నాడని ఫిలింనగర్ సమాచారం. అందుకే ఇటీవల చిరు 150వ మూవీలోని ఓ సీన్ కాటమరాయుడు సెట్ లో చిత్రీకరించారు. రాజకీయాల మాట ఎలా ఉన్నా మెగాస్టార్ ‘ఖైదీ’గా భారీ స్థాయిలో ఎంట్రీ ఇలా మెగా బ్రదర్స్ పరస్పరం సహకరించచుకోవడంతో మెగా అభిమానులు ఆనందంలో ఉన్నారు.