పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కొత్త చిత్రం ప్రారంభం

Published : Nov 05, 2016, 11:37 AM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కొత్త చిత్రం ప్రారంభం

సారాంశం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత నిర్మాత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న చిత్రం (ప్రొడక్షన్ నంబర్ 4) చిత్రం ఈ ఉదయం 10 గంటల 49 నిమిషాలకు హైదరాబాద్ లోని రామానాయుడు స్థూడియోలో వైభవంగా ప్రారంభం అయింది. 

చిత్ర ప్రారంభోత్సవంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్,నిర్మాత ఎస్. రాధాకృష్ణ (చినబాబు), నిర్మాత శరత్ మరార్, సూర్యదేవర నాగవంశీ, పి.డి.వి.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) మాట్లాడుతూ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో నిర్మిస్తున్న ఈ చిత్రం 'తమ సంస్థ కు  ఎంతో  ప్రతిష్టాత్మకమైనదని తెలిపారు. డిసెంబర్ లో చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభ మవుతుందని అన్నారు. ఈ చిత్రం లో ఇద్దరు కథానాయికలు ఉంటారు. వీరితో పాటు ఇతర ప్రముఖ తారాగణం ఎంపిక కాగానే త్వరలో ప్రకటించటం జరుగుతుంది. 

ఈ చిత్రం ద్వారా  సౌత్ ఇండియా లో పాపులర్ సంగీత దర్శకుడు 'అనిరుద్ రవిచందర్' సంగీత దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. ఇండియా లో టాప్ మోస్ట్ కెమెరామెన్ వి. మణికందన్ (మణిరత్నం 'రావణ్', శంకర్ 'అపరిచితుడు', బాలీవుడ్ చిత్రాలు 'ఏ జవానీ హై దీవాని', మైహూనా) ఈ చిత్రానికి కెమెరామెన్ గా పనిచేస్తున్నారు. కళా దర్శకత్వం: ఎ.ఎస్.ప్రకాష్, ఎడిటింగ్: చంటి (కోటగిరి వెంకటేశ్వరరావు), ఎగ్జి క్యూటివ్ నిర్మాత: పి.డి.వి. ప్రసాద్. 

PREV
click me!

Recommended Stories

The Raja Saab కథ లీక్‌ చేసిన ప్రభాస్‌, హైలైట్‌ ఇదే.. తాను పనిచేసిన డైరెక్టర్స్ గురించి క్రేజీ వర్డ్స్
Prabhas: పెళ్లి ఎందుకు చేసుకోలేదో చెప్పిన ప్రభాస్‌, ఎవరూ ఊహించరు.. `స్పిరిట్‌` లుక్‌ మైండ్‌ బ్లోయింగ్‌