తెరపైకొస్తున్న మెగాస్టార్-పూరీల “ఆటోజాని”

Published : Nov 29, 2016, 12:53 PM ISTUpdated : Mar 25, 2018, 11:41 PM IST
తెరపైకొస్తున్న మెగాస్టార్-పూరీల “ఆటోజాని”

సారాంశం

బాస్ ఈజ్ బ్యాక్ వరుసగా మూవీస్ సెట్ చేస్తున్న మెగా స్టార్ మెగాస్టార్ హీరోగా పూరీ దర్శకత్వంలో "ఆటోజానీ"

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న 150వ చిత్రం ఖైదీ నెం 150. డైన‌మిక్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ తెర‌కెక్కిస్తున్న ఖైదీ నెం 150 సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. ఓ వైపు 150వ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతుంటే... మ‌రో వైపు చిరు న‌టించ‌నున్న 151, 152 చిత్రాల స్టోరీస్ రెడీ అవుతుండ‌డం విశేషం. మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ లో చేయ‌నున్నారు. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ నిర్మించే ఈ భారీ చిత్రానికి బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న‌ాడు.

 

స‌రైనోడు సినిమాతో మెగా కాంపౌండ్ లో ఎంట్రీ ఇచ్చిన బోయ‌పాటి ఇటీవ‌ల చిరంజీవికి క‌థ చెప్ప‌డం...క‌థ విని చిరు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం జ‌రిగింద‌ట‌. ఇక 152 సినిమా విష‌యానికి వ‌స్తే...పూరి జ‌గ‌న్నాథ్ ఆటోజానీ అనే టైటిల్ తో చిరంజీవికి గ‌తంలో ఓ క‌థ చెప్పారు. ఈ క‌థ‌కు ప్ర‌స్తుతం మార్పులు చేస్తున్నార‌ట‌. 152వ చిత్రం పూరితో ఉంటుంది అని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈవిధంగా 150 వ చిత్రం సెట్స్ పై ఉండ‌గానే 151, 152 చిత్రాల‌కు రెడీ అవుతున్నారు మెగాస్టార్..! సో... బాస్ ఈజ్ బ్యాక్.

PREV
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్