`ఆదిపురుష్‌` టీమ్‌కి చినజీయర్‌ స్వామి సత్కారం.. సైఫ్‌ మళ్లీ మిస్సింగ్‌..

By Aithagoni RajuFirst Published Jun 6, 2023, 9:53 PM IST
Highlights

మొదట స్టేజ్‌పైకి వచ్చిన చిన్న జీయర్‌ స్వామి  `ఆదిపురుష్‌` టీమ్‌ని సత్కరించారు. ప్రభాస్, దర్శకుడు ఓం రౌత్‌, హీరోయిన్‌ కృతి సనన్‌, నిర్మాత భూషణ్‌ కుమార్‌లను ఆయన శాలువలతో సత్కరించారు. 

ప్రభాస్‌ నటించిన `ఆదిపురుష్‌` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఈ సాయంత్రం తిరుపతిలో తారకరామ స్టేడియంలో గ్రాండ్‌గా జరుగుతుంది. కనీవినీ ఎరుగని విధంగా ఈ ఈవెంట్‌ని నిర్వహిస్తున్నారు. ప్రముఖ స్వామిజీ చిన్న జీయర్‌ స్వామి ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ ఈవెంట్‌కి ప్రభాస్‌ గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చారు. అయితే డిఫరెంట్‌గా, ఊహించని విధంగా ఆయన ఎంట్రీ ఉంటుందని భావించారు. అలాంటి ఊహాగానాలు వదిలింది యూనిట్‌. 

కానీ ప్రభాస్‌ ఎంట్రీ సింపుల్‌గానే జరిగింది. ఆడియెన్స్ మధ్యలో నుంచి ఆయన ఈవెంట్‌కి వచ్చారు. అలాగే గెస్ట్ గా వచ్చిన చిన్న జీయర్‌ స్వామి ఎంట్రీ సైతం ప్రభాస్‌ తరహాలో జరిగింది. ప్రభాస్‌ రాకతో ఈవెంట్‌ మొత్తం హోరెత్తిపోయింది. ఫ్యాన్స్ అరుపులతో తిరుపతి దద్దరిల్లిపోయింది. టాపాసుల మోత మారుమోగింది. అనంతరం మొదట స్టేజ్‌పైకి వచ్చిన చి జీయర్‌ స్వామి టీమ్‌ని అభినందించారు. `ఆదిపురుష్‌` టీమ్‌ని సత్కరించారు. ప్రభాస్, దర్శకుడు ఓం రౌత్‌, హీరోయిన్‌ కృతి సనన్‌, నిర్మాత భూషణ్‌ కుమార్‌లను ఆయన శాలువలతో సత్కరించారు. వారికి తమ జ్ఞాపికలను అందజేశారు. ఇది ప్రత్యేకంగా నిలిచింది. స్టేజ్‌పై ఇలాంటి సత్కారం జరగడం చాలా అరుదు. 

అనంతరం చిన్న జీయర్‌ స్వామి మాట్లాడారు. నిజమైన బాహుబలి రాముడు అని నిరూపించడం కోసం తాను ఈ కార్యక్రమానికి వచ్చానని తెలిపారు. ప్రతి వ్యక్తిలో రాముడు ఉంటాడని, ప్రతి గుండెలో రాముడు ఉంటాడు. అందరిలో రాముడు ఉంటాడు. వారిలోని రాముడిని బయటకు తీసుకురావడం కోసం ప్రభాస్‌ తనలోని రాముడిని బయటకు తీసుకొచ్చారని తెలిపారు. 

అయితే ఈ ఈవెంట్‌లో దర్శకుడు, హీరోయిన్‌, హనుమంతుడి పాత్రని పోషించిన దేవదత్త నాగె, లక్ష్మణుడు పాత్రని పోషించిన సన్నీ సింగ్‌, మ్యూజిక్‌ డైరెక్టర్స్ అజయ్‌, అతుల్‌ పాల్గొన్నారు.  అయితే ఈ కార్యక్రమానికి సైఫ్‌ అలీ ఖాన్‌ మిస్‌ అయ్యారు. రావణుడి పాత్రలో ఆయన నటించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు జరిగిన ఏ ఈవెంట్‌కి కూడా సైఫ్‌ రాలేదు. టీజర్‌, ట్రైలర్‌ ఈవెంట్లలోనూ ఆయన కనిపించలేదు. `ఆదిపురుష్‌`కి సంబంధించిన అతిపెద్ద ఈవెంట్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి అయినా ఆయన వస్తారని భావించారు. కానీ హాజరు కాకపోవడం గమనార్హం. 
 

click me!