ఆదిపురుష్ ప్రీ రిలీజ్ వేడుకకు ఎన్ని కోట్లు ఖర్చు చేశారంటే?

Published : Jun 06, 2023, 07:56 PM IST
ఆదిపురుష్ ప్రీ రిలీజ్ వేడుకకు ఎన్ని కోట్లు ఖర్చు చేశారంటే?

సారాంశం

ఆదిపురుష్ ప్రీ రిలీజ్ కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహిస్తున్నారు. తిరుపతి వేదికగా జరుగుతున్న ఈ ఈవెంట్ కి కోట్ల రూపాయలు ఖర్చు చేశారనే ప్రచారం జరుగుతుంది.   

ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీగా నిర్వహిస్తున్నారు. దేశం మొత్తం ఆదిపురుష్ గురించి చెప్పుకునే స్థాయిలో ప్లాన్ చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు తిరుపతికి చేరుకున్నారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వేదికగా జరుగుతున్న ఆదిపురుష్ ప్రీ రిలీజ్ వేడుకకు హాజరయ్యారు. ఒక ప్రక్క వర్షం పడుతున్నా లెక్క చేయకుండా లక్షల్లో అభిమానులు రావడం జరిగింది. కాషాయ జెండాలు పట్టి, జై శ్రీరామ్ నామ స్మరణతో వేదికను హోరెత్తిస్తున్నారు. 

కాగా ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం నిర్మాతలు కోట్లలో ఖర్చు చేస్తున్నారట. కేవలం బాణా సంచా కోసం రూ. 50 లక్షలు కేటాయించారట. ఇక ఈవెంట్ నిర్వహణకు మొత్తంగా రూ. 2.5 కోట్లు వెచ్చించినట్లు సమాచారం అందుతుంది. గతంలో ఏ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఇంత మొత్తంలో ఖర్చు చేయలేదని చెప్పవచ్చు. ఇది హాట్ టాపిక్ గా మారింది. 

ఆదిపురుష్ మూవీలో ప్రభాస్ మొదటిసారి రాముడు పాత్ర చేస్తున్నారు. సీతగా కృతి సనన్ నటిస్తున్నారు. రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించారు. దర్శకుడు ఓం రౌత్ ఆదిపురుష్ చిత్రాన్ని తెరకెక్కించారు. జూన్ 16న వరల్డ్ వైడ్ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. మూవీపై భారీ హైప్ నెలకొన్న నేపథ్యంలో పెద్ద మొత్తంలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఓపెనింగ్ డే ఆదిపురుష్ రికార్డు వసూళ్లు నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తుంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode: దీపను తప్పుపట్టిన కాంచన- అత్తా, కోడళ్ల మధ్య దూరం పెరగనుందా?
Akhanda 2 : బాలయ్య అభిమానులకు భారీ షాక్, ఆగిపోయిన అఖండ2 రిలీజ్ , కారణం ఏంటంటే?