దరిద్రులు.. ఇంకా ఎందుకు బ్రతికున్నారో: చిన్మయి

Published : Jan 19, 2019, 11:22 AM ISTUpdated : Jan 19, 2019, 11:36 AM IST
దరిద్రులు.. ఇంకా ఎందుకు బ్రతికున్నారో: చిన్మయి

సారాంశం

 గతంలో కోలీవుడ్ రచయిత పై లైంగిక వేధింపులకు సంబందించిన ఆరోపణలు చేసిన చిన్మయి మరోసారి తన ఆగ్రహ జ్వాలను ట్విట్టర్ గూట్లో మొదలెట్టింది. ఈసారి నెటిజన్స్ పై మాటలతో తన కోపాన్ని చూపించింది. 

మీటూ దుమారం తగ్గిందని అనుకునేలోపే వాటి కారణంగా మరో కొత్త వివాదాలు వైరల్ అవుతున్నాయి. గతంలో కోలీవుడ్ రచయిత పై లైంగిక వేధింపులకు సంబందించిన ఆరోపణలు చేసిన చిన్మయి మరోసారి తన ఆగ్రహ జ్వాలను ట్విట్టర్ గూట్లో మొదలెట్టింది. ఈసారి నెటిజన్స్ పై మాటలతో తన కోపాన్ని చూపించింది. 

అసలు ఇలాంటి వాళ్ళు ఎందుకు బ్రతికున్నారో అర్ధం కావడం లేదంటూ కామెంట్ చేసింది. మీటూ ఆరోపణలు చేసినప్పటి నుంచి చిన్మయికి మద్దతు బాగానే లభించినప్పటికీ ఓ వర్గం వారి నుంచి మాత్రం విమర్శలు గట్టిగానే ఎదురవుతున్నాయి. దీంతో ఇటీవల కొందరు నెటిజన్స్ చేసిన కామెంట్స్ కి ఈ సింగర్ మరో ఘాటు కౌంటర్ ఇచ్చింది. 

సోషల్ మీడియాలో విమర్శలు చేసేవారు చాలా మంది ఉంటారు. ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది అంటే సైలెంట్ గా ఉండాలేమో.. వాళ్ళు ఎంత తిట్టినా కామ్ గా ఉండాలి. మళ్ళీ ఆ దరిద్రులని సార్.. అన్నా.. అంటూ ఉండాలి. అత్యాచారం చేస్తామంటూ మూర్ఖంగా ట్వీట్స్ పెడుతున్నారు,  ఖర్మ కాకపోతే ఇలాంటి వారు ఇంకా ఎందుకు బ్రతికున్నారో అర్ధం కావడం లేదు. ఇలాంటి వల్గర్ కామెంట్స్ చేస్తే ఈ విషయంలో ట్విట్టర్ మాత్రం ఏం చేయగలదు.. ఇక పోలీసులకు కూడా భారమే.. అన్నట్లు చిన్మయి తన వివరణ ఇచ్చింది.

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode:దీప, శౌర్యలపై పారు ప్రేమ-దీప చావుకు ప్లాన్-నిజం తెలుసుకున్న కార్తీక్
Illu Illalu Pillalu April 2 Episode: వల్లి బాగోతం మొత్తం బట్టబయలు.. ఇంటి నుంచి గెంటేసిన చందు