F2 ఎఫెక్ట్: ఫుల్ పైసల్!

By Prashanth MFirst Published Jan 19, 2019, 10:52 AM IST
Highlights

సినిమా నార్మల్ హిట్టయితే ఎక్కడో ఒక చోట బయ్యర్స్ కి నష్టాలు వస్తుంటాయి. అన్ని ఏరియాల్లో కాసుల వర్షం కురవడం అనేది రేర్ గా జరిగేది,. అయితే F2 మాత్రం అందరికి ఫుల్లుగా లాభాలను అందిస్తోంది. 

టాలీవుడ్ లో మార్కెట్ లో సాధారణంగా ఒక సినిమా హిట్టయితే అందరికి మంచి లాభాలు అందాయి అనుకోవడం పొరపాటే. ఎందుకంటే సినిమా నార్మల్ హిట్టయితే ఎక్కడో ఒక చోట బయ్యర్స్ కి నష్టాలు వస్తుంటాయి. అన్ని ఏరియాల్లో కాసుల వర్షం కురవడం అనేది రేర్ గా జరిగేది,. అయితే F2 మాత్రం అందరికి ఫుల్లుగా లాభాలను అందిస్తోంది. 

మొదట్లో పెద్ద సినిమాలు పోటీగా ఉన్నాయని దిల్ రాజు తక్కువ థియేటర్స్ లోనే ఈ కామెడీ సినిమాను రిలీజ్ చేశాడు. కానీ ఇప్పుడు వినయ విధేయ రామ - ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలకు థియేటర్స్ తగ్గడంతో F2 ఒక్కసారిగా టాప్ లోకి వచ్చేసింది. దాదాపు అన్ని ఏరియాల్లో ఈ కామెడీ ఎంటర్టైనర్ మంచి లాభాలను అందిస్తోంది. దీంతో థియేటర్స్ సంఖ్య కూడా పెరుగుతోంది.

మొదటివారం కలెక్షన్స్ స్ట్రాంగ్ గా రావడంతో ఇప్పుడు 50 కోట్లకు పైగా షేర్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ వారం పెద్ద సినిమాలేవీ లేవు కాబట్టి 60 కోట్ల షేర్స్ వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. గత ఏడాది వరుస అపజయాలతో తీవ్రంగా నష్టపోయిన దిల్ రాజు ఈ ఏడాది మొదటగా F2 తో ఫుల్ గా లాభాలను అందుకున్నాడు. 

దర్శకుడు అనిల్ రావిపూడికి కూడా ఇప్పుడు డిమాండ్ బాగా పెరిగింది. స్టార్ హీరోలు బడా నిర్మాతలు అతనితో వర్క్ చేయడానికి పోటీపడుతున్నారు. అయితే దిల్ రాజు అతన్ని వదలకుండా మరో రెండు సినిమాలకు ఒప్పందం కుదర్చుకున్నట్లు సమాచారం.

click me!