Latest Videos

స్టార్‌ డైరెక్టర్స్ మెచ్చిన కుర్ర హీరో ఎవరో తెలుసా?.. `చౌర్యపాఠం` మూవీ వెనక ఇంట్రెస్టింగ్‌ స్టోరీ

By Aithagoni RajuFirst Published May 25, 2024, 9:51 PM IST
Highlights

`చౌర్య పాఠం` మూవీతో హీరోగా పరిచయం అవుతున్నాడు ఇంద్ర రామ్‌. ఆయన వెనకాలు ఇద్దరు స్టార్‌ డైరెక్టర్లు ఉండటం విశేషం. 
 

ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా సినిమాల్లోకి వచ్చిన నిలదొక్కుకోవడం అంత ఈజీకాదు. అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకుని ఇండస్ట్రీని రూల్‌ చేస్తున్నారు మెగాస్టార్‌ చిరంజీవి. రవితేజ, విజయ్‌ దేవరకొండ, నాని, విజయ్‌ సేతుపతి వంటి స్టార్స్ అలా వచ్చి ఇక్కడ నిలబడ్డారు. స్టార్లుగా ఎదిగారు. కొందరు ఎదుగుతున్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని చిత్ర పరిశ్రమలోకి వచ్చాడు మరో కుర్రాడు ఇంద్ర రామ్‌. ప్రస్తుతం `చౌర్య పాఠం` చిత్రంతో హీరోగా తెలుగు తెరకి పరిచయం అవుతున్నాడు. 

ఈ మూవీని స్టార్‌ డైరెక్టర్‌ త్రినాథరావు నక్కిన నిర్మిస్తుండగా, మరో దర్శకుడు కార్తిక్‌ ఘట్టమనేని ఈ మూవీకి బ్రిలియంట్‌ స్టోరీ అందించడం విశేషం. ఇద్దరు ప్రముఖ దర్శకులు ఇంద్రని తన సినిమా కోసం ఎంపిక చేయడం మరో విశేషం. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. ఇటీవల విడుదలైన టీజర్‌ అదిరిపోయింది. ఈ నేపథ్యంలో హీరో ఇంద్ర రామ్‌ ఈ మూవీ గురించి, డైరెక్టర్స్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఎంతో మందిని ఆడిషన్‌ చేసి తనని ఇందులో హీరోగా ఎంపిక చేయడం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. 

ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన ఇంద్ర.. యాక్టింగ్‌ కోర్స్ చేశారు. యాక్టింగ్‌ నేర్చుకుని ఆ తర్వాత అనేక ప్రొడక్షన్‌ హౌజ్‌ల చుట్టూ, దర్శకుల చుట్టూ తిరిగాడు. అనేక అవమానాలు, తిరస్కారాలు ఫేస్‌ చేశాడు. ఈ క్రమంలో ఆడిషన్‌లో `చౌర్యపాఠం` చిత్రం కోసం హీరోగా ఎంపికయ్యాడు. ఆ ఆనందాన్ని వ్యక్తం చేశాడు ఇంద్ర. తన పుట్టిన రోజు సందర్భాన్ని పురస్కరించుకుని ఈ విషయాన్ని తెలిపారు. ఇదొక డిఫరెంట్‌ స్టోరీ అని, చాలా కొత్తగా ఉంటుందన్నాడు. ఈ మూవీ కోసం రెండేళ్లుగా కష్టపడుతున్నట్టు తెలిపాడు. అయితే ఈ ఒక్క మూవీకే నాలుగైదు సినిమాలకు పనిచేసినంత అనుభవం వచ్చిందన్నాడు. 

త్రినాథరావు నక్కిన, కార్తీక్‌ ఘట్టమనేనిల నుంచి చాలా నేర్చుకున్నట్టు తెలిపాడు. ఈ రెండేళ్లు తనకు బెస్ట్ ఎక్స్ పీరియెన్స్ ని ఇచ్చిందన్నాడు. కొత్తవాడిగా చాలా ఛాలెంజెస్‌ ఫేస్‌ చేసినట్టు తెలిపాడు. ఆ కష్టానికి, రెండేళ్ల వెయిటింగ్‌కి తగ్గ ఫలితం వస్తుందని, సినిమా మరో స్థాయిలో ఉంటుంది. ఈ మూవీకి కంటెంటే కింగ్‌ అన్నాడు. కొత్త కంటెంట్‌ని ఆడియెన్స్ ఆదరిస్తున్నారు. దీన్ని కూడా ఆదరిస్తారని నమ్ముతున్నట్టు తెలిపారు యంగ్‌ హీరో ఇంద్ర రామ్‌. ప్రస్తుతం మరికొన్ని సినిమాలు ఓకే అయ్యాయని, అవి కమర్షియల్‌ వేలో సాగుతున్నయని తెలిపారు. నక్కిన నెరేటివ్స్ బ్యానర్‌ పై నిఖిల్ గొల్లమారి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. 
 

click me!