ఆ ప్రసక్తే లేదు.. క్లారిటీ ఇచ్చిన చార్మీ

Published : Jun 20, 2020, 02:10 PM IST
ఆ ప్రసక్తే లేదు.. క్లారిటీ ఇచ్చిన చార్మీ

సారాంశం

యాక్షన్ బ్యాక్‌ డ్రాప్‌లో పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ను బాలీవుడ్‌ స్టార్‌ ప్రొడ్యూసర్‌ కరణ్ జోహర్‌తో కలిసి పూరి జగన్నాథ్‌, ఛార్మీలు స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడిగా బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది.

ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్న డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ ఆ సినిమా తరువాత సెన్సేషనల్‌ స్టార్‌ విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమాను ప్రారంభించాడు. యాక్షన్ బ్యాక్‌ డ్రాప్‌లో పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ను బాలీవుడ్‌ స్టార్‌ ప్రొడ్యూసర్‌ కరణ్ జోహర్‌తో కలిసి పూరి జగన్నాథ్‌, ఛార్మీలు స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడిగా బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది.

అయితే ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా లాక్‌ డౌన్‌ కారణంగా వాయిదా పడింది. ఇప్పటికే మూడు నెలల వాయిదా పడటం, తరువాత కూడా గతంలోలా షూటింగ్ చేసే పరిస్థితి లేకపోవటంతో సినిమాకు సంబంధించి రకరకాల వార్తలు మీడియాలో వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సినిమా రేంజ్‌ను పాన్‌ ఇండియా లెవల్‌ నుంచి తగ్గించనున్నారన్న ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుత పరిస్థితుల్లో భారీ బడ్జెట్‌తో సినిమాలు రూపొందిస్తే వర్క్‌ అవుట్‌ అయ్యే పరిస్థితి లేని నేపథ్యంలో సినిమా కథా కథనాల్లో మార్పులు చేస్తున్నట్టుగా ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఈ వార్తలపై నిర్మాత చార్మీ స్పందించింది. మీడియాలో వస్తున్నట్టుగా పూరి, విజయ్‌ దేవరకొండల సినిమాకు ఎలాంటి మార్పులు చేయటం లేదని క్లారిటీ ఇచ్చారు. దీంతో కొద్ది రోజులుగా మీడియాలో వినిపిస్తున్న రూమర్స్‌కు తెర పడినట్టైంది.

PREV
click me!

Recommended Stories

Jason Sanjay: చిన్నప్పుడు అన్నీ గొడవలే, దూరమయ్యాకే ప్రేమేంటో తెలిసింది.. చెల్లిపై జాసన్ సంజయ్ ఎమోషనల్‌ కామెంట్
Srinivasa Mangapuram 5 Days Collections: శ్రీనివాస మంగాపురంకి షాకింగ్‌ కలెక్షన్లు.. మహేష్‌ అన్న కొడుక్కి ఇది ఊహించలేం