బాలీవుడ్‌లో లాబీయింగ్‌పై గళమెత్తిన మరో హీరో

Published : Jun 20, 2020, 10:01 AM IST
బాలీవుడ్‌లో లాబీయింగ్‌పై గళమెత్తిన మరో హీరో

సారాంశం

తాజాగా యాక్టర్‌ అభయ్ డియోల్‌ కూడా ఇండస్ట్రీలోని లాబీయింగ్ గురించి మట్లాడాడు. `2011లో రిలీజ్‌ అయిన జిందగీ నా మిలేంగీ దుబారా గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటాం. ఏదైనా ఒత్తిడిలో ఉన్న సమయంలో ఇప్పటికీ అదే సినిమా చూస్తాం.

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మరణం సృష్టించిన ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇండస్ట్రీలోని మోనోపలి, కొందరి ఆదిపత్యం  కారణంగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడన్న వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో సుశాంత్‌ను చాలా ప్రాజెక్ట్స్‌ నుంచి తప్పించారని అందుకే తీవ్ర ఒత్తిడికి లోనైన సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తున్నారు కొందరు ఇండస్డ్రీ ప్రముఖులు.

ఈ నేపథ్యంలో ఇప్పటికే కంగనా రనౌత్‌ తో పాటు పలువురు దర్శకుడు, నటులు ఇండస్ట్రీలోని దారుణ పరిస్థితుల గురించి పెదవి విప్పుతున్నారు. ఈ నేపథ్యంలో మరో హీరో కూడా ఇండస్ట్రీలోని ఇబ్బందుల గురించి మాట్లాడాడు. తాజాగా యాక్టర్‌ అభయ్ డియోల్‌ కూడా ఇండస్ట్రీలోని లాబీయింగ్ గురించి మట్లాడాడు. `2011లో రిలీజ్‌ అయిన జిందగీ నా మిలేంగీ దుబారా గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటాం. ఏదైనా ఒత్తిడిలో ఉన్న సమయంలో ఇప్పటికీ అదే సినిమా చూస్తాం. అయితే ఈ సినిమాకు సంబంధించి దాదాపు అన్ని సినిమా ఫంక్షన్స్‌లో మమ్మల్ని సపోర్టింగ్ యాక్టర్స్‌గా డిమోట్ చేశారు.

ఆ సినిమాలకు సంబంధించి హృతిక్ రోషన్‌, కత్రినా కైఫ్‌ లను హీరో హీరోయిన్లుగా నామినేట్ చేశారు. ఒక వ్యక్తి ఓ అమ్మాయి ప్రేమలో పడతాడు. ఆ వక్తి ఏ నిర్ణయం తీసుకోవాలన్న తన స్నేహితుల సాయం తీసుకుంటాడు. అదే ఈసినిమా కథ. ఈ సినిమాలో హృతిక్‌, ఫర్హాన్‌, నాది ముగ్గురిది లీడ్ రోల్‌ కానీ ఇండస్ట్రీ మాత్రం మమ్మల్ని సపోర్టింగ్‌ రోల్స్‌గా మాత్రమే గుర్తించింది. ఇండస్ట్రీలో లాబీయింగ్ కారణంగానే ఇలా జరిగిందన్న అభిప్రాయం వ్యక్తం చేశాడు అభయ్ డియోల్‌.

సినిమాల విషయానికి వస్తే అభయ్ డియోల్‌ చివరగా నెట్‌ఫ్లిక్స్‌ ఒరిజినల్స్‌ మూవీ చాప్‌స్టిక్స్‌లో నటించారు. 2019లో తమిళ సినిమాలోనూ నటించాడు అభయ్. మహదేవ్‌ తో కోలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన అభయ్, తరువాత జీ5 లో లైన్ ఆఫ్ డీసెంట్‌ లో నటించాడు.

PREV
click me!

Recommended Stories

Sanjana Remuneration : విన్నర్ రేంజ్ లో పారితోషికం అందుకున్న సంజన గల్రానీ, 15 వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు ఎంత ఇచ్చారంటే?
Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి