
చార్మి సిట్ విచారణ ముగిసింది. ఆరు గంటలపాటు విచారించిన అధికారులు కోర్టు ఆదేశాల మేరకు 5 గంటల సమయం లోపే విచారణ ముగించేశారు. ఇక ఆరు గంటలపాటు చార్మిని విచారించిన సిట్ అధికారులు చార్మి వద్ద కీలక సమాచారం రాబట్టినట్టు సమాచారం. కెల్విన్ తో గల సంబంధాలు, కెల్విన్ మొబైల్ లో ఛార్మి దాదా అని కాంటాక్ట్ సేవ్ చేసి వుండటం, పూరీ, కెల్విన్ ల సంబంధాలు, డ్రగ్స్ అలవాటు, ఎలా డ్రగ్స్ సమకూరాయి లాంటి సమాచారం కోసం సిట్ అధికారులు చార్మిని ప్రశ్నించినట్లు సమాచారం.
డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న చార్మి.. విచారణ నిమిత్తం సిట్ కార్యాలయానికి వచ్చిన సందర్భంలో పోలీసులు వే బ్లాక్ చేసి నానా హంగామా చేశారు. సిట్ కార్యాలయంలో సెలెబ్రిటీలు ఎంటరవుతున్న ప్రతి సారి ఈ తంతు సాగుతూనే వుంది. 19వ తేదీన పూరీ జగన్నాథ్ విచారణకు హాజరైనప్పటి నుంచి ఇప్పటి దాకా రోజూ ఉదయం పది గంటల ప్రాంతంలో నోటీసులు అందుకున్న టాలీవుడ్ ప్రముఖులు విచారణకు హాజరవుతున్నారు. సెలెబ్రిటీలు అటెండ్ అయిన ప్రతిసారి.. వెహికిల్ దిగిన దగ్గరి నుంచి సిట్ కార్యాలయంలోకి ఎంటరయ్యే దాకా దారిలో బందోబస్తుకు నిలబడే పోలీసు అధికారులు నానా హంగామా చేస్తున్నారు.
ఇక మగవారంటే ఎలాగోలా ఆ పద్మ వ్యూహం నుంచి బయటపడి సిట్ విచారణ గదికి చేరుకుంటున్నారు. కానీ టాలీవుడ్ లో అగ్ర నటిగా వెలుగొంది.. ఇప్పుడు సిట్ నోటీసులు అందుకుని.. హైకోర్టును ఆశ్రయించి.. మహిళా అధికారుల సమక్షంలోనే తనను విచారించాలని కోరి.. సిట్ కార్యాలయానికి విచారణకు వచ్చిన చార్మి ఈ ఉదయం 9.45 ప్రాంతంలో కార్యాలయానికి వచ్చారు.
ఇక చార్మి సిట్ కార్యాలయానికి వచ్చిన సందర్భంలో అభిమానులెవరూ.. అక్కడికి రాలేదు. ఎవరో కొంత మంది వచ్చినా వారికి అనుమతి ఎలాగూ నిరాకరించారు. మరోవైపు బౌన్సర్ భద్రత నడుమ సిట్ కార్యాలయానికి వచ్చిన చార్మి.. పోలీసుల హంగామాతో ఉక్కిరి బిక్కిరయ్యారు. చాలా మంది మహిళా అధికారులు అక్కడే వున్నా... కొంత మంది పురుష పోలీస్ ఆఫీసర్లు మహిళా పోలీసులను పక్కకు నెట్టి మరీ చార్మిని కంగారు పెట్టేశారు. పనిలో పనిగా అససభ్యకరంగా ఆమె వెన్నుపై, అక్కడా ఇక్కడా చేతులు వేసి తమకేమీ తెలియదన్నట్టు కటింగ్ ఇచ్చారు. అయితే.. హైకోర్టు ఆదేశించినా పోలీసుల వ్యవహార శైలిలో మార్పు రాకపోవడంతో చార్మి అసహనానికి గురైంది. సిట్ విచారణ గదిలోకి చేరుకోగానే చార్మి నుంచి సిట్ అధికారులే ప్రశ్నలు ఎదుర్కొన్నారు.
తన పట్ల ఓ కానిస్టేబుల్ అసభ్యంగా ప్రవర్తించాడని, అసలు మహిళా పోలీసులు వుండగా అలా కానిస్టేబుల్స్ హడావుడి చేయడం తనకు చాలా అసౌకర్యంగా అనిపించిందని వెంటనే చార్మి ఫిర్యాదు చేసింది. దాంతో విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని సిట్ అధికారులు చార్మికి హామీ ఇచ్చారు. మొత్తానికి ఆరు గంటలపాటు విచారించిన సిట్ ఆధికారులు మరింత సమాచారం సేకరించారని తెలుస్తోంది. అయితే తన బ్లడ్ శాంపిల్స్, వెంట్రుకలు, గోర్లు ఇవ్వలేదు. మొత్తానికి ఉదయం టెన్షన్ పడుతూ కనిపించిన చార్మి.. సాయంత్రం వెళ్లే సమయానికి కూల్ గా.. అభివాదం చేస్తూ.. నవ్వుతూ తిరిగెళ్లింది.