అఖిల్ మూవీ గురించి నాకు అసలు తెలియదంటున్న నాగ్

Published : Mar 26, 2021, 03:48 PM IST
అఖిల్ మూవీ గురించి నాకు అసలు తెలియదంటున్న నాగ్

సారాంశం

అఖిల్ తో మంచి హిట్ కొట్టించాలని నాగార్జున ధృడ సంకల్పంతో ఉన్నారు. అఖిల్ లేటెస్ట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీ విషయంలో నాగార్జున అనేక జాగ్రత్తలు తీసుకున్నారని టాలీవుడ్ లో పుకార్లు వినిపించాయి. చివరకు కథ, కథనాల విషయంలో అనేక మార్పులు చేర్పులు చేయడంతో పాటు, సలహాలు సూచనలు ఇచ్చారనేది ఇండస్ట్రీ వర్గాల బోగట్టా.   

అక్కినేని నాగేశ్వరరావు నటవారసత్వంలో మూడవతరం హీరోలుగా నాగ చైతన్య, అఖిల్ ఎంట్రీ ఇచ్చారు. నాగ చైతన్య వెండితెరకు పరిచయమై పదేళ్లు దాటిపోయింది. స్టార్ హీరో ఇమేజ్ సంపాదించక పోయినా ఓ రేంజ్ హీరోగా స్థిరపడ్డాడు. టాలీవుడ్ లో నాగ చైతన్య చిత్రాలకు ఒక మార్కెట్ ఏర్పడింది. నాగార్జున రెండో కుమారుడు అఖిల్ మాత్రం ఇంకా హిట్టు మెట్టు ఎక్కలేదు. ఆయన హీరోగా నటించిన మూడు చిత్రాలు కూడా పరాజయం పాలయ్యాయి. 

దీనితో అఖిల్ తో మంచి హిట్ కొట్టించాలని నాగార్జున ధృడ సంకల్పంతో ఉన్నారు. అఖిల్ లేటెస్ట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీ విషయంలో నాగార్జున అనేక జాగ్రత్తలు తీసుకున్నారని టాలీవుడ్ లో పుకార్లు వినిపించాయి. చివరకు కథ, కథనాల విషయంలో అనేక మార్పులు చేర్పులు చేయడంతో పాటు, సలహాలు సూచనలు ఇచ్చారనేది ఇండస్ట్రీ వర్గాల బోగట్టా. 

అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదని నాగార్జున అంటున్నారు. అసలు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీ కథ కూడా తనకు తెలియదని నాగార్జున అనడం చాలా మందిని ఆశ్చర్యంలో ముంచివేస్తుంది. తాజా ఇంటర్వ్యూలో నాగార్జున అఖిల్ కెరీర్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అఖిల్ ని ప్రేక్షకులు హీరోగా అంగీకరించారు, ఇక విజయం పొందడానికి కొంత సమయం పట్టవచ్చు.. అని నాగార్జున అన్నారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Actress Nandini: పర్సనల్ రీజన్స్, సీరియల్ హీరోయిన్ నందిని ఆత్మహత్య
Heroes Come Back: 2025లో అదిరిపోయే కమ్‌ బ్యాక్‌ ఇచ్చిన 10 మంది హీరోలు వీరే.. పవన్‌ నుంచి ఆది వరకు