'చాప్రా మర్డర్ కేస్' (ఆహా ) OTT మూవీ రివ్యూ!

By Surya Prakash  |  First Published Oct 1, 2024, 1:39 PM IST

 మ‌ల‌యాళంలో   విడుద‌లై పాజిటివ్ టాక్  తెచ్చుకున్న అంచక్కల్లకొక్కన్ (Anchakkallakokkan) అనే సినిమాను తెలుగు డబ్బింగ్ వెర్షన్. 



మళయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు తెలుగు ఓటిటిలోకి వచ్చి ఇక్కడ మనవాళ్లను ఆకట్టుకుంటున్నాయి. ఆ ట్రెండ్ గత మూడేళ్లుగా నడుస్తూనే ఉంది. తాజాగా మరో మళయాళ చిత్రం తెలుగులో డబ్బింగ్ అయ్యి ఇక్కడ ఓటిటిలో రిలీజైంది. మలయాళంలో మంచి టాక్ తెచ్చుకున్న  అంచక్కల్లకొక్కన్ కు ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్. నటుడు చెంబన్ వినోద్ జోస్ నిర్మాతగా ఉల్లాస్ చెంబన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను తెలుగులో చాప్రా మర్డర్ కేస్ టైటిల్‌తో నేరుగా ఓటీటీలో రిలీజ్ చేశారు.ఆ సినిమా ఎలా ఉందో చూద్దాం.

 
 'చాప్రా మర్డర్ కేస్'  సినిమా కథేంటి

 
 1986 సంవ‌త్స‌రంలో  ఈ సినిమా జరుగుతుంది.  క‌ర్ణాట‌క‌, కేర‌ళ బోర్డ‌ర్‌లోని ఓ కొండ ప్రాంతం లో 'కాళహస్తి' అనే గ్రామం ..  నేపధ్యం . అక్కడ  ఓ ఎస్టేట్‌లో ఉండే చాప్రా ఓ రోజు రాత్రి అడ‌వి పంది కోసం వేటకు వెళ్తే ..అక్కడ  గుర్తు తెలియ‌ని వారు ఆయన్ని హ‌త్య చేస్తారు. పెద్ద సెన్సేషన్ అవుతుంది ఆ కేసు. ఆ కేసుపై  పోలీసు ఇన్విస్టిగేషన్ ప్రారంభం అవతుంది. చాప్రా ఇన్ఫూలియన్సెడ్ పర్శన్ కావటంతో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా, త్వరలో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అర్జెంట్ గా క్లోజ్ చేయాల్సిన పరిస్దితి.

Latest Videos

undefined

ఇక  ఆ కేసును విచారిస్తున్న స‌మ‌యంలోనే  వాసుదేవన్ (లుక్మన్ అవరన్) అనే కొత్త కానిస్టేబుల్ డ్యూటీలో చేరతాడు. అయితే అతను భయస్దుడు. డ్యూటీలో  చేరి అప్ప‌టికే అక్క‌డ చాలా కాలంగా పనిచేస్తూ, ప‌లుకుబ‌డి ఉన్న‌ నాద వరంబన్ (చెంబన్ వినోద్ దాస్) క‌లిసి అదే స్టేషన్ లో  ఉంటుంటాడు. నాద వరంబన్ కేసుని తనదైన స్టైల్ లో డీల్ చేస్తూంటాడు. మరో ప్రక్క తండ్రి మరణ వార్త తెలిసిన చాప్రా కొడుకులు  ఆ ఊరికి వస్తారు. త‌మ తండ్రిని చంపిన వారిని వెతుకుతూ అనుమానం ఉన్న వాళ్లని చంపేస్తుంటారు. 

రోజు రోజుకీ పోలీసులపై ఒత్తిడి పెరిగిపోతుంది. కేసు ఏదో రకంగా క్లోజ్ చేయాల్సిన సిట్యువేషన్. ఈ లోగా  ఊహించని శంకర్  ( మణికందన్ ఆచారి)  అనే వ్య‌క్తి నేనే చాప్రాను చంపానంటూ సరెండర్ అయ్యిపోతాడు. అక్కడ నుంచి కథ మలుపు తిరుగుతుంది. శంకర్ ఆ వ్యక్తిని చంపలేదని డౌట్ వస్తుంది. అయితే ఈవిషయం తెలియని చాప్రా కొడుకులు శంకర్ ని చంపేయటానికి  పోలీస్ స్టేషన్ కు వస్తారు. ఇదిలా ఉంటే వాసుదేవన్ కు శంకర్ ద్వారా ఈ కేసుకు సంబంధించి అనేక కొత్త విషయాలు తెలుస్తాయి. దాంతో ఆ విషయాలు తెలిసిన వాసుదేవన్ కూడా ఆ మర్డర్ చేసిన వ్యక్తికి టార్గెట్ అవుతాడు. ఇంతకీ చాప్రాని చంపిందెవరు, ఎందుకు చంపారు, శంకర్ ఎందుకు వచ్చి లొంగిపోయారు. ఆ  రాత్రి అసలేం జరిగింది , వీటితో పాటు వాసుదేవన్  గతం ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

 
 'చాప్రా మర్డర్ కేస్'  ఎలా ఉందంటే

 
ఈ సినిమా ప్లాట్ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. అలాగే స్టైయిట్ నేరేషన్ తో పెద్దగా కుదుపులు లేకుండా  నడుస్తుంది.ఈ కథకు హాలీవుడ్ డైరక్టర్స్  Tarantino,  Coen Brothers నేరేషన్ ని ప్రేరణగా తీసుకన్నా నేటివిటికి బాగా ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే కేరళలో పాపులర్ అయిన ఓ పాపులర్ జానపద కథను ఎంచుకోవటం రిఫ్రెష్ గా అనిపిస్తుంది. అయితే ఈ సినిమా అన్ని వర్గాలకు నచ్చేది కాదు. కొత్తగా ట్రై చేద్దామనుకునేవాళ్లకు ఈ సినిమా నచ్చుతుంది. 
 
ఇది పూర్తిగా స్క్రీన్ ప్లే బేసెడ్ మూవీ.  స్టైల్ గా తీయటానికి ప్రయత్నించారు. ఈ ఏడాది మార్చిలో మ‌ల‌యాళంలో   విడుద‌లై పాజిటివ్ తెచ్చుకున్న అంచక్కల్లకొక్కన్ (Anchakkallakokkan) అనే సినిమాను తెలుగు డబ్బింగ్ వెర్షన్. ఓ పర్టిక్యులర్ ఈవెంట్ ని  డిఫరెంట్ ఏంగిల్స్ లో ఓపెన్ చేయటం అనే టెక్నిక్ ద్వారా ఈ సినిమాని నడిపించారు దర్శకుడు  ఉల్లాస్. అయితే ఈ సినిమా భలే ఉందే అనిపించే వావ్ ఫ్యాక్టర్స్ కనపడవు. 

అయితే కొత్తగా ఓపెన్ అయ్యే ఫ్లాష్ బ్యాక్ ద్వారా కొత్త విషయాలు కథ గురించి తెలుస్తూ ఆశ్చర్యపరుస్తాయి.  చూసిన సీన్ నే మళ్లీ వేరే యాంగిల్ లో ఓపెన్ చేసినప్పుడు భలే ఉంది అనిపిస్తుంది. Tarantino కు బాగా ప్రభావితం అయ్యి...చాప్రా కొడుకులు క్యారక్టర్స్ డిజైన్ చేసారు. అవి డిఫరెంట్ గా ఉంటాయి. అయితే ఈ సినిమాకు వచ్చిన చిక్కు అంతా హింస ఎక్కువ అవటం. పోలీస్ స్టేషన్ లో ఆ స్దాయి హింస చూపెట్టడం మనకు కార్తీ ఖైదీ క్లైమాక్స్ ని గుర్తు చేస్తుంది. అలాగే ఈ సినిమాలో ఏ పాత్రతోనూ మనం ఎమోషనల్ గా కనెక్ట్ కాము. 

'చాప్రా మర్డర్ కేస్'  ఎక్కడ చూడచ్చు

టెక్నికల్ గా ఈ సినిమా స్ట్రాంగ్ గా ఉంది.ఆర్మో ఫొటోగ్రఫీ లో కేరళ లొకేషన్స్ కనువిందు చేస్తూంటాయి.  మణికందన్ అయ్యప్పబ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఈ సినిమాకి చాలా హెల్ప్ అయింది. రోహిత్ ఎడిటింగ్ కూడా బాగుంది. లుక్మ‌న్ అవ‌ర‌న్ (Lukman Avaran), చెంబ‌న్ వినోద్ జోష్ (Chemban Vinod Jose), మ‌ణికంద‌న్ ఆచారి, శ్రీజిత్ ర‌వి కీల‌క పాత్ర‌ల్లో పోటీ పడి చేసారు.  చెంబ‌న్ వినోద్ జోష్ చాలా కాలం గుర్తుండిపోయే ఫెరఫార్మెన్స్ ఇచ్చాడు. 

చూడచ్చా

అసభ్యత లేదు కానీ హింస ఎక్కువగా ఉంది కాబట్టి ప్యామిలీతో చూడటం కష్టం. క్రైమ్ ,సస్పెన్స్ సినిమాలు చూసేవారికి బాగుందనిపిస్తుంది.  

ఎక్కడుంది

ఆహా ఓటిటిలో తెలుగులో ఉంది.


 

click me!