షాకింగ్ ఇన్ఫో: రామ్ చరణ్, బుచ్చిబాబు చిత్రం స్క్రిప్టు డిస్కషన్స్ కే అన్ని కోట్లా?

By Surya Prakash  |  First Published Oct 1, 2024, 12:53 PM IST

ఇండస్ట్రీలో కొందరు సీనియర్ రచయితలు, బుచ్చిబాబుతో జర్నీ చేస్తున్న టీమ్, సుకుమార్ రైటింగ్ డిపార్టమెంట్ లో కొందరు కలిసి ఈ స్క్రిప్టుపై రోజూ కూర్చుంటున్నారట. 


రామ్ చరణ్ ,బుచ్చిబాబు కాంబినేషన్ లో రూపొందబోయే చిత్రంపై ఏ రేంజి హైప్ ఉందో తెలిసిందే. ఈ సినిమా  ఎనౌన్సమెంట్ రావటంతో అందరి దృష్టీ ఈ సినిమాపై పడింది.   ఆర్‌సీ16 వర్కింగ్ టైటిల్ తో చేస్తున్న  ఈ సినిమా లో ప్రతీ విషయం భారీ ఖర్చుతో ముడిపడి ఉందని వార్తలు వస్తున్నాయి. ఉప్పెన దర్శకుడు బుచ్చి బాబు ఈ సినిమాని ఎలాగైనా ప్యాన్ ఇండియా లెవిల్లో బ్లాక్ బస్టర్ చేయాలనే ప్లాన్ తో రాత్రింబవళ్లూ కష్టపడుతున్నారు. అందులో భాగంగా స్క్రిప్టు వర్క్ కోసం చాలా మంది రైటర్స్ తో కూర్చుంటున్నారని వినికిడి. నిర్మాతలు సైతం ఈ సినిమా స్క్రిప్టు డిస్కషన్స్  కోసం భారీ బడ్జెట్ పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.  ఆ ఎమౌంట్ ఎంతో తెలిస్తే కళ్లు చెదురుతాయి. 

రామ్ చరణ్ సైతం ముందు స్క్రిప్టుపైనే ఎక్కువ కసరత్తులు చేయమని చెప్పారట. ఉప్పెన ఓ లవ్ స్టోరీ. కానీ ఇప్పుడు రామ్ చరణ్ తో తయారు చేస్తున్న కథ హార్ట్ హిట్టింగ్ యాక్షన్ తో కూడిన కథనం అంటున్నారు. కాబట్టి ఇండస్ట్రీలో కొందరు సీనియర్ రచయితలు, బుచ్చిబాబుతో జర్నీ చేస్తున్న టీమ్, సుకుమార్ రైటింగ్ డిపార్టమెంట్ లో కొందరు కలిసి ఈ స్క్రిప్టుపై రోజూ కూర్చుంటున్నారట. సెకండాఫ్ లో వచ్చే కొన్ని ఎపిసోడ్స్ అద్బుతంగా డిజైన్ చేస్తున్నారని అంటున్నారు. రామ్ చరణ్ ఈ స్క్రిప్టు వర్క్ కూడా బడ్జెట్ లో భాగమే అని నిర్మాతలను ఒప్పించి రైటర్స్ కు మంచి ఎమౌంట్స్ ఇప్పిస్తున్నారని చెప్పుకుంటున్నారు. 

రామ్ చరణ్  స్క్రిప్టు డిస్కషన్స్ కే అంత ఖర్చా

Latest Videos

undefined

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం స్క్రిప్టు నిమిత్తం రెండున్నర నుంచి మూడు కోట్లు దాకా ఖర్చు అవుతోందిట. అది కూడా బుచ్చిబాబు ఆల్రెడీ రాసేసిన స్క్రిప్టుని ఫైన్ ట్యూన్ చేయటానికే అంటున్నారు. ఇప్పటికే ఈ స్క్రిప్టుని సుకుమార్ రెండు సార్లు విన్నాడని, కొన్ని కరెక్షన్స్ చెప్పారని చెప్పుకుంటున్నారు. ఫైనల్ గా సుకుమార్ మరో సారి విన్న తర్వాత ఫుల్ గా లాక్ చేస్తారని వినికిడి. 

సుకుమార్ ఈ స్క్రిప్టుకు కొన్ని టిప్స్ చెప్పారని, ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ పై చాలా రోజులు వర్క్ చేసారని తెలుస్తోంది. అలాగే స్క్రిప్టుని రామ్ చరణ్, చిరంజీవి కూడా విన్నారని, చిరంజీవికు బాగా నచ్చిందని ఆయన కూడా కొన్ని సూచనలు ఇచ్చారని కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్న బుచ్చిబాబు  చిత్రానికి మంచి క్రేజ్ ఉంది.  ఈ మాస్‌ ఎంటర్‌టైనర్‌కు ‘పెద్ది’ (#RC16) అనే పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఈ టైటిల్‌ను ఎన్టీఆర్‌ సినిమా కోసం బుచ్చిబాబు రిజిస్టర్‌ చేశారని.. ఇప్పుడు అదే పేరును రామ్ చరణ్‌ సినిమాకు పెడుతున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇందులో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా కనిపించనుంది.  

పెంచేసిన రామ్ చరణ్ రెమ్యునరేషన్ 

 
 మరో ప్రక్క ఈ సినిమా నిమిత్తం రామ్ చరణ్ తీసుకోబోయే రెమ్యునేషన్ ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది. గేమ్ ఛేంజర్ చిత్రం కన్నా 30 కోట్లు పెంచి తీసుకున్నట్లు తెలుస్తోంది.  ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు ముందు రూ.30 నుంచి రూ.40 కోట్లు  తీసుకునే చరణ్‌..  గేమ్ ఛేంజర్ చిత్రానికి ఏకంగా రూ. 95 కోట్ల నుంచి రూ. 100 కోట్లు తీసుకుంటున్నాడని తెలుస్తోంది. ఆ తర్వాత ఇప్పుడు చేయబోయే బుచ్చి బాబు చిత్రానికి మైత్రీ వారే ముందుకు వచ్చి  ఏకంగా 30 శాతం పెంచాడని అంటున్నారు. అంటే దాదాపు  రూ. 30 కోట్లు  పెంచినట్టు తెలుస్తోంది. అంటే ఆ లెక్క ప్రకారం బుచ్చిబాబుతో చేస్తున్న సినిమాకు రూ. 125 కోట్ల నుంచి రూ. 130 కోట్ల వరకు తీసుకుంటున్నట్టు  సినీ సర్కిల్లో  వినిపిస్తోంది. ఈ క్రమంలో ప్రభాస్‌ తర్వాత తెలుగులో అత్యధిక రెమ్యునరేషన్‌ తీసుకునే హీరోల్లో చరణ్‌ టాప్‌లో నిలిచాడు. అయితే ఈ విషయమై మీడియాలో వార్తలే తప్పించి అధికారిక సమాచారం లేదు. 


ఉత్తరాంధ్ర స్పోర్ట్స్ పర్శన్ గా రామ్ చరణ్

 
ఈ చిత్రం నిమిత్తం ఉత్తరాంధ్ర నుంచి ఏకంగా 400 మందిని తీసుకోనున్నారు.  ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్ లో స్పోర్ట్స్ డ్రామాగా సినిమా తెరకెక్కించనున్నారు. అలాగే రామ్ చరణ్ ఉత్తరాంధ్రకు చెందిన స్పోర్ట్స్ పర్శన్ గా కనిపించనున్నారు. అక్కడ స్లాంగ్ నే మాట్లాడనున్నారు. రంగస్దలం చిత్రం అచ్చమైన  గోదావరి యాసలో మాట్లాడిన ఆయన ఈ సినిమాలోనూ ఉత్తరాంధ్ర యాసతో ఆకట్టుకోనున్నారు. అందుకోసం రామ్ చరణ్ హోమ్ వర్క్ చేయబోతున్నారు. డైలాగులు విషయంలో ఉత్తరాంధ్రకు చెందిన ఓ ప్రముఖ నవలా రచయిత సాయిం చేస్తున్నట్లు వినికిడి. ఏప్రియల్ నుంచి ఈ చిత్రం షూటింగ్ మొదలు కానుంది. రామ్ చరణ్ తన తాజా చిత్రం గేమ్ ఛేంజర్ రిలీజ్ తర్వాత ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటారు. ఇప్పటికే ఓ స్పెషల్ ట్రైనర్ ని పెట్టుకుని ఫిజిక్ ని రెడీ చేసుకుంటున్నారట. తను అనుకున్న షేప్ రాగానే షూట్ మొదలు కానుందని అంటున్నారు. 

 రంగస్దలం ను మించిన మేకోవర్ తో రామ్ చరణ్ చిత్రం

                             స్పోర్ట్స్‌ డ్రామాగా... గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో ఇది సిద్ధం కానున్నట్లు తెలుస్తోంది. రామ్‌చరణ్‌కు జోడీగా జాన్వీకపూర్‌ కనిపించనున్నారు. శివరాజ్‌కుమార్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. రెహమాన్ స్వరాలు అందించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌, వృద్ధి సినిమాస్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి.  అలాగే  ఈ  సినిమాలో సీనియర్ నటి లయ కూడా నటించనుంది. ఇక ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.


 
 రంగస్దలం ను మించిన మేకోవర్ తో ఫిల్మ్ తెరకెక్కించబోతున్నట్లు ఇన్ సైడ్ వర్గాల సమాచారం.  ఇతర నటీనటుల ఎంపిక కూడా జరుగుతోందట.   పూర్తి వివరాలను బుచ్చిబాబు అండ్ టీమ్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.  మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై వెంకట సతీష్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.   


 

click me!