`చంద్రముఖి 2` ఓటీటీ రిలీజ్‌ లో సడెన్‌ ట్విస్ట్.. ముందుగానే రాక..

By Aithagoni Raju  |  First Published Oct 21, 2023, 9:07 PM IST

రాఘవ లారెన్స్, కంగనా రనౌత్‌ కలిసి నటించిన `చంద్రముఖి 2` గత నెలలో విడుదలైంది నెగటివ్‌ టాక్ తెచ్చుకుంది. అయితే నెల రోజుల్లోనే ఈ చిత్రం ఓటీటీలో రాబోతుంది.


రాఘవ లారెన్స్(Raghava Lawarene), కంగనా రనౌత్‌(Kangana Ranaut) కలిసి నటించిన మూవీ `చంద్రముఖి 2`(Chandramukhi2). రజనీకాంత్‌, నయనతార, జ్యోతిక కలిసి నటించిన `చంద్రముఖి` చిత్రానికి సీక్వెల్‌. మాతృక దర్శకుడు పి. వాసు ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహించారు. లైకా సంస్థ నిర్మించిన ఈ చిత్రం గత నెలలో విడుదలైంది. సెప్టెంబర్‌ 28న విడుదలై నెగటివ్‌ టాక్‌ని తెచ్చుకుంది. రజనీ `చంద్రముఖి` చిత్రానికి రీమేక్‌లా ఉందనే విమర్శలు వచ్చాయి. సినిమా దారుణంగా డిజాస్టర్‌గా నిలిచింది. సినిమా బాగా లేదనే టాక్‌తో ఆడియెన్స్ థియేటర్ కి వెళ్లలేదు. ఓటీటీలో చూసుకుందాం లే అనే ఫీలింగ్‌లో ఉన్నారు. 

ఇదిలా ఉంటే ఈ చిత్రం ఓటీటీ డేట్‌ ఫిక్స్ అయ్యింది. సినిమా రిలీజ్‌ అయి నెల రోజుల్లోనే ఓటీటీలో రాబోతుంది. ఏకంగా వచ్చే వారంలోనే సినిమా డిజిటల్‌లో స్ట్రీమింగ్‌ కాబోతుంది. ఈ సినిమా డిజిటల్‌ హక్కులను నెట్‌ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. సుమారు పది కోట్లకి ఈ రైట్స్ తీసుకుందని సమాచారం. ఈ నేపథ్యంలో వచ్చే వారం నెట్‌ ఫ్లిక్స్ లో `చంద్రముఖి 2` స్ట్రీమింగ్‌ (Chandramukhi2 OTT) కానుంది. అయితే ముందుగా అక్టోబర్‌ 27న రాబోతుందని అన్నారు. కానీ ఇప్పుడు ఒక్క రోజు ముందుగానే రాబోతుందట. ఈ నెల 26నే ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతుందని నెట్‌ ఫ్లిక్స్ ప్రకటించింది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో ఇది స్ట్రీమింగ్‌ కానుంది. 

Latest Videos

`చంద్రముఖి 2` సినిమా ఎన్నో అంచనాల మధ్య వచ్చింది. రజనీకాంత్‌ నటించిన తొలి చిత్రం పెద్ద విజయం సాధించడంతో దాదాపు 17ఏళ్ల తర్వాత దానికి సీక్వెల్‌ తెరకెక్కిస్తుండటంతో అంతా ఆసక్తికరంగా ఎదురుచూశారు. కానీ ఈ చిత్రం బాగా నిరాశ పరిచింది. కేవలం లీడ్‌ కాస్టింగ్‌ రజినీ స్థానంలో లారెన్స్, జ్యోతిక స్థానంలో కంగనా వచ్చింది కానీ, మిగతాదంతా సేమ్‌ అనే అభిప్రాయాన్ని ఆడియెన్స్ వెల్లడించారు. దీంతో సినిమా పెద్ద డిజాస్టర్‌ అయ్యింది. 
 

click me!