అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చలపతిరావు

Published : Feb 16, 2018, 04:39 PM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చలపతిరావు

సారాంశం

సీనియర్ నటుడు చలపతిరావుకు స్వల్ప గాయాలయ్యాయి. షూటింగ్ చేస్తుండగా బస్సు వెనుక నిచ్చెన ఎక్కుతుండగా చలపతిరావు కింద పడ్డారు ప్రస్తుతం చలపతిరావు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు

సీనియర్ నటుడు చలపతిరావుకు స్వల్ప గాయాలయ్యాయి. ఫిల్మ్‌సిటీలో షూటింగ్ చేస్తుండగా బస్సు వెనుక నిచ్చెన ఎక్కుతుండగా చలపతిరావు కింద పడ్డారు. దీంతో ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చలపతిరావు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అల్లరి నరేష్‌ సినిమా షూటింగ్‌ సమయంలో ప్రమాదం జరిగినట్టు సమాచారం. 

చలపతిరావు ఆరోగ్యంపై ఆందోళన చెందవద్దని, చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. చలపతిరావు ఆరోగ్య పరిస్థితిని చిత్ర నిర్మాత, డాక్టర్లను అడిగి తెలుసుకుంటున్నారు. చలపతిరావు ఆరోగ్యంపై హీరో నరేష్‌ వాకబు చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?