‘బబ్బా’ గా చైతూ, క్యారక్టర్ కథ ఇదే

Surya Prakash   | Asianet News
Published : Jul 25, 2021, 07:16 AM IST
‘బబ్బా’ గా చైతూ, క్యారక్టర్ కథ ఇదే

సారాంశం

నాగ చైతన్య కూడా ఆమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను డైరెక్ట్‌గా పలకరించనున్నారు. ఇటీవల సినిమా షూటింగ్‌లో జాయిన్ అయ్యారు చైతూ. 

అమీర్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’. కరీనా కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ‘ఫారెస్ట్ గంప్’కు రీమేక్ గా తెరకెక్కుతోంది ‘లాల్ సింగ్ చద్దా’.  ఈ చిత్రంలో విజయ్ సేతుపతి కీలకపాత్రలో నటించాల్సి ఉంది. కానీ విజయ్ సేతుపతి స్థానంలో నాగ చైతన్య ఈ చిత్రంలోని యుద్ధ సన్నివేశాలు చేస్తున్నారు.అద్వైత్ చందన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా షూటింగ్ లద్దాఖ్‌లో జరుగుతోంది. ఈ షూటింగ్‌లో ఆమీర్ ఖాన్‌తో కలిసి నాగ చైతన్య షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. ‘లాల్ సింగ్ చద్ధా’ను ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో చైతూ ఉండటంతో తెలుగులోనూ ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఇంతలా హైప్ క్రియేట్ చేస్తున్న ఈ ప్రాజెక్టులో చైతు క్యారక్టర్ ఏమిటి అనేది చూద్దాం.

 ఈ చిత్రంలో దక్షిణాదికి చెందిన ఓ యువకుడి పాత్ర ఉంది. కథను కీలక మలుపు తిప్పే అతికీలకమైన ఆ క్యారెక్టర్ ఇది.  ‘లాల్ సింగ్ చద్దా’ హాలీవుడ్ మూవీ ‘ఫారెస్ట్ గంప్’కు అఫీషియల్ రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఆన్ లొకేషన్ పిక్స్ చూస్తే అతను సైనికుడిగా కనిపించనున్నాడని అర్దమైంది.  టామ్ హాంక్స్ నటించిన  ‘ఫారెస్ట్ గంప్’ఒరిజినల్లో ‘బబ్బా’ అనే ఇంట్రస్టింగ్ క్యారక్టర్  ఉంటుంది.  సైన్యంలోకి అడుగు పెట్టిన హీరోకు అక్కడ దొరికే ఏకైక ప్రెండ్ బబ్బానే. కాస్త చిత్రమైన ఎక్సప్రెషన్స్ తో అమాయకంగా కనిపిస్తాడు. అతడి కంపెనీని హీరో ఎంతో ఇష్టపడతాడు. 

ఆర్మీ  నుంచి రిటైరయ్యాక పెద్ద ఓడ కొనుక్కుని దాని ద్వారా సముద్రంలో చేపలు పట్టాలన్నది అతడి కల. కానీ అతడి జీవితం అర్ధంతరంగా ముగిసిపోతుంది. ఈ సన్నివేశాలు చాలా హృద్యంగా ఉంటాయి. హీరో సైన్యం నుంచి నిష్క్రమించాక బబ్బా కలను నెరవేరుస్తాడు. సినిమాలో ఈ పాత్ర ఉండేది అటు ఇటుగా అరగంటే కానీ.. దాని ఇంపాక్ట్ మాత్రం సినిమా అంతా కొనసాగుతుంది. చైతూ ఈ పాత్రలోనే నటిస్తున్నాడని సమాచారం. 

ఈ చిత్రాన్ని ఈ సంవత్సరం క్రిస్మస్ కానుకగా విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కానీ సినిమా షూటింగ్ సమయంలో ఎదురైన సమస్యల కారణంగా ముందుగా అనుకున్న షెడ్యూల్ లు ఆలస్యం అయ్యాయి.  కోవిడ్-19 సెకండ్ వేవ్ కారణంగా చాలా సినిమాల షూటింగులు ఆగిపోయి లైటైంది. 

నాగ చైతన్య విషయానికొస్తే.. ఈయన హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘లవ్ స్టోరీ’ చిత్రం త్వరలో విడుదల కానుంది.  ఈ చిత్రంలో సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది. తెలంగాణ ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాలోని పాపులర్ అయ్యాయి.  మరోవైపు నాగ చైతన్య విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ’ అనే సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ఇటలీలో జరిగింది. ఈ సినిమాలో నాగ చైతన్య సరసన రాశీఖన్నాతో అవికా గోర్, మాళవిక నాయర్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Demon Pavan Remuneration : 15 లక్షల జాక్ పాట్ తో పాటు, డిమాన్ పవన్ రెమ్యునరేషన్ టోటల్ గా ఎంతో తెలుసా?
Bigg Boss Telugu: ఈ విషయంలో అందరూ ఫెయిల్ అయ్యారు, బిగ్ బాస్ పై మండిపడ్డ రోహిణీ