ఆట ఇప్పుడే మొదలైందిః ఒలింపిక్‌ విన్నర్‌ మీరాబాయి చానుకి బాలయ్య, మహేష్‌ అభినందనలు

Published : Jul 24, 2021, 07:16 PM IST
ఆట ఇప్పుడే మొదలైందిః ఒలింపిక్‌ విన్నర్‌ మీరాబాయి చానుకి బాలయ్య, మహేష్‌ అభినందనలు

సారాంశం

భారత వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయ్‌ చాను రజతం సాధించిన సందర్బంగా ఆమెకి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు సినీ తారలు. తాజాగా బాలకృష్ణ, మహేష్‌బాబు మీరాబాయి విజయాన్ని ప్రశంసించారు.

టోక్యో ఒలింపిక్స్ లో భారత వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయ్‌ చాను రజతం సాధించిన విషయం తెలిసిందే. ప్రారంభంలోనే రజతంతో  ఒలింపిక్స్ లో భారత్‌ శుభారంభాన్నిచ్చిందని చెప్పొచ్చు. దీంతో దేశం గర్విస్తోంది. మీరాబాయి చాను సాధించిన విజయంలో దేశ ప్రజానికం హర్షం వ్యక్తం చేస్తుంది. ఈ సందర్బంగా ఆమెకి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

సినీ తారలు సైతం విషెస్‌ చెబుతున్నారు. తాజాగా బాలకృష్ణ, మహేష్‌బాబు మీరాబాయి విజయాన్ని ప్రశంసించారు. బాలకృష్ణ ఫేస్ బుక్‌ ద్వారా అభినందనలు తెలియజేశారు. `టోక్యో ఒలింపిక్స్ లో మహిళల వెయిట్‌ లిఫ్టింగ్‌లో కష్టపడి సిల్వర్‌ సాధించిన మీరాబాయి చానుకి హృదయ పూర్వక అభినందనలు. మనం ఎప్పటికీ ఎంతో ఆదరించే క్షణం. ఆమె అద్భుతమైన విజయంతో దేశాన్ని గర్వించేలా చేసింది. ఇంకా మరిన్ని పతకాలు మనకు రాబోతున్నాయి` అని తెలిపారు. 

మరోవైపు మహేష్‌బాబు సైతం స్పందించారు. `భారతీయ జెండా ఎగరడం ప్రారంభమైంది. టోక్యో 2020 ఒలింపిక్స్ లో వెయిట్‌ లిఫ్టింగ్‌లో రజతం సాధించిన మీరాబాయి చానుకి నా తరపున పెద్ద అభినందనలు. యాక్షన్‌(గేమ్‌) ఇప్పుడే ప్రారంభమైంది` అని ట్వీట్‌ చేశారు మహేష్‌. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

జన నాయగన్ వివాదం మధ్యలో షారుఖ్ ఖాన్ పేరు, విజయ్ ఎందుకు ప్రస్తావించాడు? కారణం ఏంటంటే?
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ : ఆస్తిలో ఎవరు అసలైన బాస్? ఎవరి సంపాదన ఎంతంటే?