ఎన్టీఆర్ కి లేని సీన్ వైఎస్ కి ఉందా..?

By Udayavani DhuliFirst Published Jan 21, 2019, 12:04 PM IST
Highlights

సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ ల హవా నడుస్తోంది. నిజ జీవితాల ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రాలకు బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపధ్యంలో చాలా మంది దర్శకనిర్మాతల దృష్టి బయోపిక్ ల మీద పడింది. 

సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ ల హవా నడుస్తోంది. నిజ జీవితాల ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రాలకు బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపధ్యంలో చాలా మంది దర్శకనిర్మాతల దృష్టి బయోపిక్ ల మీద పడింది. ఆసక్తికరంగా లేకపోతే బయోపిక్ ని కూడా ప్రజలు చూడరని ఎన్టీఆర్ 'కథానాయకుడు' సినిమాతో తేలిపోయింది.

ఎన్టీఆర్ కథ కావడంతో సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూసిన అభిమానులను ఈ సినిమా మెప్పించలేకపోయింది. దానికి ఒక్కొక్కరు ఒక్కో డ్రాబ్యాక్ చెప్పుకొస్తున్నారు. ఎన్టీఆర్ నే జనాలు చూడలేదంటే మరి వైఎస్సార్ బయోపిక్ 'యాత్ర' పరిస్థితేంటనే భయం మేకర్స్ లో కనిపిస్తోంది.

ఫిబ్రవరి 8న విడుదల కాబోతున్న ఈ సినిమాకి ప్రేక్షకాదరణ దక్కుతుందా లేదా..? అనే టెన్షన్ తో ఉన్నారు దర్శకనిర్మాతలు. వైఎస్ జీవితంలో ఆసక్తి కలిగించే విషయాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి ఆయనకి ఉన్న ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్. కానీ ఈ సినిమాలో ఆ విషయాలను టచ్ చేయడం లేదు.

వైఎస్సార్ పాదయాత్ర, జనాల మంచి కోరుకునే నాయకుడిగా మాత్రమే ఆయన్ని చూపించబోతున్నారు. ఎన్టీఆర్ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఎంతగా చూపించినా వర్కవుట్ అవ్వలేదు. మరవేవీ లేకుండానే వస్తోన్న 'యాత్ర' సక్సెస్ అవుతుందా..? అనేది చూడాలి!

click me!