
జగపతిబాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న `రుద్రంగి` సినిమాపై ఒక్కసారిగా హైప్ పెంచేశాడు బాలయ్య. ఇటీవల జరిగిన `రుద్రంగి` ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి బాలకృష్ణ గెస్ట్ గా వచ్చిన విషయం తెలిసిందే. ఆయన సినిమా గురించి గొప్పగా చెప్పారు. అదే సమయంలో తెలంగాణ యాసలోనూ మాట్లాడారు. ఆయన కూడా తెలంగాణ నేపథ్యంలో `భగవంత్ కేసరి` చిత్రం చేస్తున్న నేపథ్యంలో ఈ ఈవెంట్‌లో తెలంగాణ యాసలో మాట్లాడి అభిమానులను అలరించారు. దీంతో ఆ ఈవెంట్ వైరల్‌గా మారడంతోపాటు చర్చనీయాంశం అయ్యింది.
దీనికితోడు తెలంగాణ కళాకారుడు, ఎమ్మెల్యే రసమయి బాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటంతో మరింత ఆసక్తి ఏర్పడింది. అజయ్ సామ్రాట్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. జగపతిబాబుతోపాటు మమతా మోహన్‌దాస్, విమలా రామన్, దివి వాంధ్త్యా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. చాలా రోజుల తర్వాత మమతా మోహన్‌దాస్ ఈ చిత్రంతో తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది.
తెలంగాణ గడీల నేపథ్యంలో దొరల అరాచకాల ప్రధానంగా సాగే పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతుందని అర్థమైంది. ట్రైలర్ వాహ్ అనిపించేలా ఉంది. చిన్న సినిమాగా వచ్చినా, ట్రైలర్ ని చూస్తే ఇది చాలా పెద్ద స్కేల్ ఉన్న మూవీ అని అర్థమవుతుంది. అయితే ట్రైలర్‌లోనే కొన్ని బూతు పదాలు ఉపయోగించారు. అవి కాస్త జుగుప్సాకరంగా అనిపించాయి. కథలో భాగంగా, ఆ ఎమోషన్‌లో భాగంగానే ఆయా పదాలను వాడినా, వినడానికి కాస్త ఇబ్బందిగా అనిపించింది.
తాజాగా సెన్సార్‌కి వెళ్లిన టీమ్‌కి సెన్సార్ బోర్డ్ పెద్ద షాకిచ్చింది. ఈ బూతులు చూసి ఖంగుతిన్న బోర్డ్ కోతలు విధించింది. భారీగా ఈ సినిమాకి కట్స్ ఇవ్వడం విశేషం. రెండుగంటల 22 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రాన్ని `యు / ఏ` సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. అందుకుగానూ ఏకంగా ఎనిమిది కట్స్ విధించింది. `లం.. కొడకా`, `లం.. ముండా`, `లం..`, అలాగే `బాంచెత్`, `బోసిడి`, `బాస్టర్డ్` వంటి పదాలకు కట్స్ విధించింది. వాటి ప్లేస్‌లో కొత్త పదాలను యాడ్ చేయాలని తెలిపింది. దీంతోపాటు `ల.. కొడకా`.. వంటి పది పదాలకు మ్యూట్స్, కట్స్ విధించింది. మరోవైపు జగపతిబాబు సీన్ పై కూడా తీవ్ర అభ్యంతరం తెలిపింది. మరోవైపు ఈ కథ బ్యాక్ డ్రాప్‌ని డిస్‌క్లెయిమర్‌లో తెలియజేయాలని సెన్సార్ బోర్డ్ తెలిపింది.
మొత్తంగా ఇందులోని బూతు పదాలు ఇప్పుడు షాకిస్తున్నాయి. వాటిని కచ్చితంగా తీసేయాల్సిందే అని సెన్సార్ బోర్డ్ స్పష్టం చేసింది. దీంతో నిర్మాతలు కూడా అందుకు అంగీకారం తెలియజేయడంతో `యు / ఏ` సర్టిఫికేట్ ఇచ్చింది. అయితే ఈ సినిమాలో ఇన్ని బూతులుండటమే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇది ఒకింత సినిమాపై ఆసక్తిని పెంచుతుండటం విశేషం.