
తెలంగాణలో బరాత్ ఎంత స్పెషల్ గా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ఆ బరాత్ డాన్స్ ని యాజటీజ్ దింపేసింది కీర్తి సురేష్. తెలంగాణా ప్రాంత సంస్కృతి,సంప్రదాయాలను కలుపుకుంటూ చేసిన దసరా చిత్రంలో ఈ డాన్స్ ని పెట్టి ఆ ప్రాంత వాసులుకే కాక అందరికీ ఆనందం కలిగించారు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. సినిమలో ఓ సీన్ లో భాగంగా వెన్నెలగా నటించిన కీర్తిసురేశ్ పెళ్లి కూతురు గెటప్‌లో బరాత్‌లో చేసే డ్యాన్స్ సినిమాకే మెయిన్ హైలెట్‌గా నిలిచింది. సినిమా చూసిన అందరూ ఈ డాన్స్ గురించి మాట్లాడుతున్నారు.
సినిమాలో కీర్తి సురేష్ వివాహ నిమిత్తం పెట్టిన బ్యాండ్ మేళానికి కీర్తిసురేశ్ డ్యాన్స్ చేస్తుంటే థియేటర్లలో ఉన్న ప్రేక్షకులు ఈలలు వేస్తున్నారు. రీసెంట్ గా ఈ బరాత్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. సెలబ్రేషన్స్ ఆఫ్ వెన్నెల టైటిల్‌తో విడుదల చేసిన ఈ వీడియో దుమ్ము రేపుతోంది.
సింగరేణి ఏరియాలోని వీర్లపల్లి గ్రామం చుట్టూ తిరిగే కథాంశం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సాయికుమార్, మలయాళ నటుడు షైన్ టామ్ చాకో, సముద్రఖని, పూర్ణ, జరీనా వహబ్, కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి కీలక పాత్రలు పోషించారు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు. దసరా ప్రపంచవ్యాప్తంగా తెలుగు,తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది.
శ్రీరామనవమి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మొదటి షో నుంచే సూపర్ హిట్టు టాక్ తో దూసుకు పోతుంది. మొదటి రోజే ఏకంగా 38 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి నాని కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్ గా నిలిచింది. ఇక రెండో రోజు 53 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని, మూడో రోజు 71 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంటూ దూసుకుపోతుంది. ఆదివారంతో (ఏప్రిల్ 2) మొదటి వీకెండ్ పూర్తీ చేసుకున్న ఈ చిత్రం.. 4 రోజులకు గాను 87 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకొని 100 కోట్ల మార్క్ వైపు పరుగులు పెడుతుంది. నాని వేగం చూస్తుంటే 100 కోట్ల క్లబ్ లోకి అడుగు పెట్టడానికి పెద్ద సమయం పట్టేలా లేదు.