
ఒక తప్పును కవర్ చేసే క్రమంలో మరో తప్పు చేయడం అంటే ఇదేనేమో. మంచు విష్ణు సరిగ్గా ఇలానే బుక్ అయ్యాడు. తమ్ముడు మనోజ్ తో నాకు ఎలాంటి విభేదాలు లేవు. హౌస్ ఆఫ్ మంచూస్ పేరుతో ఓ రియాలిటీ షో చేస్తున్నాం. ఆ షో ప్రమోషన్ కోసం చిన్న ఫ్రాంక్ ప్లే చేశామని జనాలను నమ్మించే ప్రయత్నం చేశారు. అంటే మనోజ్ షేర్ చేసిన వీడియోలో కనిపించిన గొడవ అంతా తూచ్ అని చెప్పాలనుకున్నారు.
కానీ ఆయన ప్రయత్నం ఫలించిన దాఖలాలు లేవు. పైగా విష్ణు ఇమేజ్ మరింతగా డ్యామేజ్ అయ్యింది. తప్పును కవర్ చేయబోయి దొరికిపోయాడని, పరువుపోగొట్టుకున్నాడన్న వాదనలు వినిపిస్తున్నాయి. హౌస్ ఆఫ్ మంచూస్ ప్రోమోకి మనోజ్ షేర్ చేసిన వీడియో జోడించి విడుదల చేయగా... దీనిలో జనాలు అనేక లోపాలు వెతికారు. కొత్త అనుమానాలు తెరపైకి తెచ్చారు.
ఫస్ట్ ఆ ప్రోమోలో మనోజ్, మంచు లక్ష్మి లేరు. ఒక వేళ విష్ణు గొడవపడుతున్న వీడియో ఫ్రాంక్ అయితే దాన్ని ప్రొఫెషనల్ కెమెరాతో షూట్ చేసేవారు. మనోజ్, మంచు లక్ష్మి ఆల్రెడీ సదరు షోతో మాకు సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. ఇక హౌస్ ఆఫ్ మంచూస్ రియాలిటీ షో ప్రకటనకు ముందే నిర్మాత చిట్టిబాబు గొడవ నిజమే, ఆ రోజు జరిగింది ఇదే అంటూ స్పష్టత ఇచ్చారు. చిట్టిబాబు మోహన్ బాబు ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు. ఆ సంఘటన జరిగిన సమయంలో ఆయన ఉన్నట్లు సమాచారం.
స్వయంగా మోహన్ బాబు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. విష్ణు 5జీ జనరేషన్ లో కన్నాంబ కాలం నాటి ట్రిక్ ప్లే చేసి దొరికిపోయాడు. పోయిన ఇజ్జత్ ఎటూ పోయింది. కోట్లు ఎందుకు బొక్క అని 'హౌస్ ఆఫ్ మంచూస్' షో విష్ణు పక్కన పట్టేసే ఆస్కారం కలదంటున్నారు. మరి చూడాలి విష్ణు మొదలెట్టిన రియాలిటీ షో డ్రామా ఎలాంటి మలుపు తీసుకుంటుందో..