హాట్ టాపిక్: అదే జరిగితే చిరుకు నైజాం లో పెద్ద దెబ్బ?

Published : Apr 04, 2023, 11:21 AM IST
హాట్ టాపిక్: అదే జరిగితే చిరుకు నైజాం లో పెద్ద దెబ్బ?

సారాంశం

 చిరు సినిమాకు డ్యామేజ్ జరగనుందంటూ కొందరు సోషల్ మీడియాలో చర్చలు జరుపుతున్నారు.  టిల్లు స్క్వేర్ కు నైజాంలో మంచి గ్రిప్ ఉంటుందని, అక్కడ కలెక్షన్స్ బాగా వస్తాయని, 


 మెగాస్టార్ చిరంజీవి కు ఉండే క్రేజే వేరు. ఈ ఏజ్ లో కూడా ఆయన వాల్తేరు వీరయ్యతో దుమ్ము దులిపారు. ఆ ఊపులో ఆయన  ప్రస్తుతం ‘భోలా శంకర్’ చిత్రం చేస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తమన్నా ఫిమేల్ లీడ్ కాగా.. కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలి పాత్రలో నటిస్తోంది. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ‘భోలా శంకర్’ చిత్ర షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఖచ్చితంగా ఈ ప్రాజెక్టుకు మంచి క్రేజ్ వస్తుందనేది మెగాభిమానుల నమ్మకం. అయితే ఇప్పుడు ఈ సినిమాపైకి మరో సినిమాని పోటీకి దింపటం మాత్రం చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. ఆ సినిమా మరేదో కాదు డీజే టిల్లు. 
 
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), త్రివిక్రమ్ కాంబినేషన్‌లో SSMB28 తెరకెక్కుతోంది. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్. ఈ చిత్రానికి నాగ వంశీ (Naga Vamshi) నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే, ఈ సినిమా ఆగస్టు 11న విడుదలవుతుందని ఈ మధ్య వార్తల వెలువడగా.. ప్రస్తుతం సంక్రాంతికి పోస్ట్‌పోన్ చేశారు. కానీ ఆగస్టు (August) 11న మెగాస్టార్ చిరంజీవి ‘భోలా శంకర్’‌కు పోటీగా ఆయన మరొక సినిమాను సిద్ధం చేసారు.ఆగష్టు 11న డేట్ కి నాగవంశీ నిర్మిస్తున్న  టిల్లు స్క్వేర్ ని తీసుకు రావడానికి ప్లాన్ చేస్తున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. మహేష్ సినిమాని వెనక్కి తీసుకు వెళ్లినా, ఆ డేట్ ని మాత్రం తమదే అంటూ టిల్లుని నిర్మాత నాగవంశీ తీసుకురాబోతున్నాడని సమాచారం.

అయితే టిల్లు స్క్వేర్ వల్ల చిరు సినిమాకు డ్యామేజ్ జరగనుందంటూ కొందరు సోషల్ మీడియాలో చర్చలు జరుపుతున్నారు.  టిల్లు స్క్వేర్ కు నైజాంలో మంచి గ్రిప్ ఉంటుందని, అక్కడ కలెక్షన్స్ బాగా వస్తాయని, అదే కనుక జరిగితే...బోళా శంకర్ చిత్రానికి ఓ రేంజిలో దెబ్బ పడుతుందని అంటున్నారు. అయితే ఇందులో నిజమెంత అనేది చూడాలి. ఎందుకంటే చిరంజీవి కు నైజాంలో మంచి గ్రిప్ ఉంది మొదటి నుంచి. ఆయన సినిమాలకు ఇక్కడ కలెక్షన్స్ బాగుంటున్నాయనేది నిజం.

PREV
click me!

Recommended Stories

Bigg Boss 9 Finale Voting : కళ్యాణ్ పడాల , తనూజ మధ్య అసలు పోటీ.., ఫినాలే ఓటింగ్ లో ఎవరు ముందున్నారంటే?
Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ