కేక వీడియో: కేరళ పోలీసులు బన్నీని బాగా వాడారే

By Surya PrakashFirst Published Feb 22, 2021, 8:42 AM IST
Highlights


ప్రజలకు అవగాహన కల్పించే క్రమంలో పోలీసులు వినూత్న దారులు వెతుక్కోవటమే కారణం అంటున్నారు. ప్రజలంతా సోషల్‌ మీడియాలో బిజీగా మారడంతో తామూ సోషల్‌ మీడియా ద్వారానే ప్రచారం చేస్తున్నామంటున్నారు. ట్విట్టర్‌ను అస్త్రంగా చేసుకొని ప్రజలను అప్రమత్తం చేస్తూ...పాటు చట్టాలను బేఖాతరు చేస్తే ఎలాంటి చర్యలు ఉంటాయో అర్థమయ్యేలా చెబుతున్నారు. 

మన రాష్ట్ర పోలీస్ లు యాడ్ లలో మన హీరోలను,మన సినిమాలను ఉపయోగించుకున్నారంటే పెద్ద విషయం ఏమీ లేదు. కానీ కేరళ పోలీస్ లు తమ రాష్ట్రంలో తాము తయారు చేసిన యాప్ ప్రచారం కోసం ఓ తెలుగు హీరోను వాడుకున్నారంటే అది ఖచ్చితంగా వార్తే. ఆ హీరో మన అల్లు అర్జునే. తమ రాష్ట్రంలో ఉన్న స్టార్ హీరోలను ప్రక్కన పెట్టి పక్క రాష్ట్రానికి చెందిన హీరోను.. పోలీసులు ఇలా గౌరవించడం అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరో ప్రక్క ఈ వార్తతో బన్నీ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీలో ఉన్నారు.

బన్నీ కెరీర్‌లో భారీ హిట్‌గా నిలిచిన చిత్రాల్లో ఒకటైన 'రేసుగుర్రం'లో వచ్చే ఓ కీలక సీన్ ని తమ యాప్ ప్రమోషన్ కు వాడారు. ఆ వీడియోలో అల్లు అర్జున్‌ ప్రమాదంలో ఉన్న తన కుటుంబాన్ని ఎలా రక్షించుకున్నాడో పోల్‌ యాప్‌ మీ దగ్గరుంటే మిమ్మల్ని కూడా మేము అలాగే కాపాడుకుంటాం అని చెప్పే ప్రయత్నం చేసారు పోలీసులు. కేవలం ఒక్క క్లిక్‌తో క్షణాల్లో మీ ముందు వాలిపోతామని చెప్తున్నారు. బన్నీకి కేరళలో భారీగా అభిమానులున్న విషయం తెలిసిందే. దాంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  అల్లు అర్జున్‌ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఆ పోలీసుకు హెల్మెట్‌ కూడా ఉంటే బాగుండేది అని విమర్శలు వదులుతున్నారు.

ప్రజలకు అవగాహన కల్పించే క్రమంలో పోలీసులు వినూత్న దారులు వెతుక్కోవటమే కారణం అంటున్నారు. ప్రజలంతా సోషల్‌ మీడియాలో బిజీగా మారడంతో తామూ సోషల్‌ మీడియా ద్వారానే ప్రచారం చేస్తున్నామంటున్నారు. ట్విట్టర్‌ను అస్త్రంగా చేసుకొని ప్రజలను అప్రమత్తం చేస్తూ...పాటు చట్టాలను బేఖాతరు చేస్తే ఎలాంటి చర్యలు ఉంటాయో అర్థమయ్యేలా చెబుతున్నారు. 

പോൽ ആപ്പ് - പോലീസ് സേവനങ്ങൾ ഇനി ഒരു കുടക്കീഴിൽ pic.twitter.com/I9Pwx9Q8uc

— Kerala Police (@TheKeralaPolice)

కేరళ పోలీసులు ప్రజలకు రక్షణ కల్పించేందుకుగాను ‘పోల్‌’ పేరుతో తెచ్చిన యాప్ ఇది.  కష్టాల్లో, ఆపదలో ఉన్న వారెవరైనా ఈ యాప్‌ ద్వారా చిన్న సందేశం పంపిస్తే చాలు వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునే వ్యవస్థను తీసుకొచ్చారు. ఈ యాప్‌ ప్రచారం కోసమే బన్నీని ఉపయోగించుకున్నారు. ఇందుకోసం బన్నీ హీరోగా నటించిన ‘రేసుగుర్రం’ సినిమాలోని ఓ సన్నివేశాన్ని వాడుకున్నారు. ఈ సినిమాలో బన్నీ పోలీస్‌ డ్రస్‌లో.. ఆపదలో తన కుంటుంబ సభ్యులను ఆదుకునేందుకు బైక్‌పై వేగంగా వచ్చే వీడియోను పోస్ట్‌ చేస్తూ.. యాప్‌ గురించి వివరించారు.  

click me!