Aadhi Pinsetty Warrior First Look : వారియర్ నుంచి ఆది పినిశెట్టి ఫస్ట్ లుక్ రిలీజ్.. ‘గురు’పరిచయం అదుర్స్..

Published : Mar 01, 2022, 03:45 PM IST
Aadhi Pinsetty Warrior First Look : వారియర్ నుంచి ఆది పినిశెట్టి ఫస్ట్ లుక్ రిలీజ్.. ‘గురు’పరిచయం అదుర్స్..

సారాంశం

ఎనర్జిటిక్ స్టార్, ఇస్మార్ట్ హీర్ రామ్ పోతినేని (Ram Pothineni) నటిస్తున్న చిత్రం ‘ది వారియర్’. ఈచిత్రం నుంచి ఇప్పటికే రామ్ పోతినేని ఫస్ట్ లుక్ రిలీజ్ కాగా.. తాజాగా ఆది పినిశెట్టి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు  మేకర్స్..   

రామ్‌ పోతినేని హీరోగా తమిళ స్టార్‌ డైరెక్టర్‌ లింగుస్వామి (Lingu Swamy) దర్శకత్వంలో  తెరకెక్కుతున్న సినిమా ‘ది వారియర్’ (The Warrior).ఈ సినిమాలో కృతి శెట్టి (Krithi Shetty), అక్షర గౌడ హీరోయిన్లుగా చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. మాస్ పోలీస్ ఆఫీసర్ తన సత్తా చూపించనున్నాడు రామ్ పోతినేని. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన టైటిల్, రామ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ అందుకుంది. అలాగే వాలెంటైన్స్ డే సందర్భంగా కూడా కృతి శెట్టి ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. విజిల్ మహాలక్ష్మి పాత్రలో నటిస్తోందీ హ్యాట్రిక్ బ్యూటీ.

తాజాగా ఈ మూవీ నుంచి ఆది పినిశెట్టి (Aadhi Pinisetty) ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. రామ్ కూడా తన ట్విట్టర్ లో పోస్టర్ ను రిలీజ్ చేస్తూ ‘ది వారియర్ నుంచి గురు చూడండి.. ఆయన కేరీర్ లోనే బెస్ట్ ఫర్ఫార్మెన్స్ చూడబోతున్నాం’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. పోస్టర్ లో మీడియం హెయిర్, బియర్డ్ ఫేస్ తో కోపంతో రగిలిపోతున్నట్టుగా ఆది పినిశెట్టి కనిపిస్తున్నారు. బ్లాక్ కుర్తాలో,  చేతికి బ్యాండ్స్ వేసుకొని, మెడలో ఒక తాయత్తులాంటి బిల్లా ధరించి మాస్ లుక్ లో అదరగొట్టాడు ఆది.  ఈ మూవీలో ఆది ‘గురు’అనే మాస్ రోల్ లో కనిపించనున్నాడు. బ్యాక్ గ్రౌండ్ పరిశీలించే  కర్నూల్ బుర్జు వద్ద జరిగే సన్నివేశంగా అనిపిస్తోంది. ఇక రామ్ పోతినేని పోలీస్ ఆఫీసర్ గా, విలన్ గా ఆదిపినిశెట్టి మధ్య వార్ నడవనున్నట్టు అర్థమవుతోంది. 

 

ఆదిపినిశెట్టి 2006లో విడుదలైన ‘ఒక విచిత్రం’తో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత తమిళంపైనా ఫోకస్ పెట్టిన ఆది ‘గుండెల్లో గోదారి’మూవీతో టాలీవుడ్ లోనూ అవకాశాలు దక్కించుకుంటూ వస్తున్నాడు.  అటు హీరోగా మెప్పిస్తూనే... ఇటు విలన్ రోల్స్ లోనూ ఏమాత్రం తగ్గడం లేదు. ‘సరైనోడు’చిత్రంలో విలన్ గా నటించిన ఆదిపినిశెట్టి.. మరోసారి ‘ది వారియర్’తో విలన్ గా కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే శరవేగంగా పూర్తి చేసుకుంటోంది. మహా శివరాత్రి సందర్భంగా విడుదల చేసిన ఆది పినిశెట్టి లుక్ కు నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీని జులై 1న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు షెడ్యూల్ చేస్తున్నారు మేకర్స్.
 

PREV
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు