హీరో మంచు విష్ణుపై కేసు నమోదు

Published : Jan 27, 2017, 03:12 PM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
హీరో మంచు విష్ణుపై కేసు నమోదు

సారాంశం

భారత దేశాన్ని రెండుగా విడదీయాలంటూ వ్యాఖ్యానించిన మంచు విష్ణు విష్ణు వ్యాఖ్యలపై కేసుపెట్టాలని నేరెడ్ మెట్ పోలీసులని ఆశ్రయించిన మణిరత్నం అనే వ్యక్తి ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేసిన నేరేడ్ మెట్ పోలీసులు

దేశాన్ని రెండుగా విభజించాలని సంచలన వ్యాఖ్యలు చేసిన హీరో మంచు విష్ణు పై కేసు నమోదు అయ్యింది . నెరేడ్ మెట్ కి చెందిన మణిరత్నం అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసారు పోలీసులు . మంచు విష్ణు లక్కున్నోడు సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతున్న సమయంలో జల్లికట్టు విషయం ప్రస్తావన కు రావడంతో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని గట్టిగా డిమాండ్ చేయడమే కాకుండా అసలు భారతదేశాన్ని ఉత్తర భారతం దక్షిణ భారతం అని రెండు గా విభజిస్తే సరి ఎందుకంటే దక్షిణాది ఓట్లతో అధికారంలోకి వస్తున్నా ఉత్తరాది మమకారం చూపిస్తూ దక్షిణాది వాళ్ళని అవమానిస్తున్నారని సంచలన ఆరోపణలు చేసాడు మంచు విష్ణు .

దాంతో ఆర్ . మణిరత్నం అనే వ్యక్తి నెరేడ్ మెట్ పోలీసులకు మంచు విష్ణు పై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసారు . మంచు విష్ణు దేశ సమగ్రతకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేసాడని ఆరోపణలు చేస్తున్నాడు మణిరత్నం .

PREV
click me!

Recommended Stories

గదిలోకి పిలిచి అసభ్యంగా ప్రవర్తించాడు, డైరెక్టర్ పై సీనియర్ నటి జయలలిత సంచలన కామెంట్స్..
Prabhas Raja Saab Movie: రాజాసాబ్ సెన్సార్ రివ్యూ.. సంక్రాంతి విన్నర్ ప్రభాస్ సినిమానేనా ?