బన్నీ వచ్చే డేట్‌ ఫిక్స్.. ఫ్యాన్స్ కి `ఇండిపెండెన్స్ డే` గిఫ్ట్ గా `పుష్ప`

By Aithagoni RajuFirst Published Jan 28, 2021, 11:04 AM IST
Highlights

తనకి `ఆర్య`, `ఆర్య2` వంటి విజయాలను అందించిన సుకుమార్‌ దర్శకత్వంలో బన్నీ `పుష్ప` చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. తాజాగా తన అభిమానులకు సడెన్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు బన్నీ.

అల్లు అర్జున్‌ ప్రస్తుతం `పుష్ప` చిత్రంలో నటిస్తున్నారు. తనకి `ఆర్య`, `ఆర్య2` వంటి విజయాలను అందించిన సుకుమార్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. తాజాగా తన అభిమానులకు సడెన్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు బన్నీ. ఆయన నటిస్తున్న `పుష్ప` చిత్ర విడుదల తేదీని ప్రకటించారు. `పుష్పరాజ్‌ వేట ఆగస్‌ 13 నుంచి ప్రారంభమవుతుంది` అని తెలిపింది యూనిట్‌.  

will begin his hunt on Aug 13th 2021 pic.twitter.com/G7AOAg6kAF

— Asianetnews Telugu (@AsianetNewsTL)

స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్ట్ 13న ఈ సినిమాని విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం ప్రకటించారు. అయితే ఊహించని విధంగా ఈ సర్‌ప్రైజ్‌నిచ్చి అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశారు. దీంతో ప్రస్తుతం `పుష్ప` యాష్‌ ట్యాగ్‌ ట్విట్టర్‌లో ట్రెండ్‌ అవుతుంది. `సలార్‌` యాష్‌ ట్యాగ్‌ని మించి `పుష్ప` ట్రెండ్‌ అవుతుండటం విశేషం. ఇదిలా ఉంటే ఈ సినిమాని పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలోనూ విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో బన్నీ పూర్తి డీ గ్లామర్‌ లుక్‌లో, విలన్‌ని పోలి ఉన్నాడు. ఈ ఫోటోలు వైరల్‌ అవుతుంది. బన్నీ లుక్‌ని సెలబ్రిటీలు ప్రశంసిస్తున్నారు.

దీనిపై అల్లు అర్జున్‌ ట్వీట్‌ చేస్తూ, `ఈ ఏడాది ఆగస్ట్ 13న థియేటర్లోకి వచ్చేందుకు `పుష్ప` లోడ్‌ అవుతుంది. ఈ ఏడాది మీ అందరిని థియేటర్‌లో కలవడానికి సంతోషిస్తున్నా. ప్రియమైన వారితో మరోసారి అదే మ్యాజిక్‌ క్రియేట్‌ చేయాలని ఆశిస్తున్నా` అని తెలిపారు. ఇందులో బన్నీ `పుష్పరాజ్‌` అనే పాత్రలో నటిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో సినిమా సాగుతుందని టాక్‌.  

loading in theatres from 13th August 2021. Excited to meet you all in cinemas this year.Hoping to create the same magic one more time with dearest & . pic.twitter.com/tH3E6OpVeo

— Allu Arjun (@alluarjun)
click me!