హిందువుల సెంటి మెంట్స్ దెబ్బ తీసారంటూ ‘కల్కి’టీమ్ కు లీగల్ నోటీసులు

Published : Jul 21, 2024, 04:47 PM ISTUpdated : Jul 21, 2024, 05:35 PM IST
హిందువుల సెంటి మెంట్స్ దెబ్బ తీసారంటూ  ‘కల్కి’టీమ్ కు లీగల్ నోటీసులు

సారాంశం

హిందువుల మతపరమైన మనోభావాలను దెబ్బతీసిందని ఆరోపిస్తూ అమితాబ్ బచ్చన్‌, ప్రభాస్ తో సహా కల్కి 2898 AD నిర్మాతలు, నటులకు ఆచార్య ప్రమోద్ కృష్ణం లీగల్ నోటీసులు పంపారు. 

రిలీజైన మొదటి రోజు నుంచే హిట్‌ టాక్‌ తెచ్చుకుని వరుస రికార్డులు సృష్టిస్తోన్న చిత్రం  ‘కల్కి 2898 ఏ.డీ’.రీసెంట్ గా  వెయ్యి  కోట్లు సాధించిన ఏడవ ఇండియన్‌ సినిమాగా.. రెండవ ప్రభాస్‌ సినిమాగా నిలిచింది. ఈ రికార్డుల వేటలో భాగంగా ఈ సినిమా మరో అరుదైన ఘనతను సాధించింది. ప్రభాస్‌ ‘భైరవ’ పాత్రలో.. అమితాబ్‌ బచ్చన్‌ పురాణ యోధుడు ‘అశ్వత్థామ’గా..కమల్‌ హాసన్‌, దీపికా పదుకొనే, రాజేంద్ర ప్రసాద్‌ కీలక పాత్రల్లో అలరించారు. ఈ సినిమాకు కొనసాగింపుగా పార్ట్‌-2 తెరకెక్కనుందని చిత్ర టీమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇలా టీమ్ ఉత్సాహంగా ఉన్న సమయంలో చిన్న బ్రేక్ లాంటి వార్త వచ్చింది.

హిందువుల మతపరమైన మనోభావాలను దెబ్బతీసిందని ఆరోపిస్తూ అమితాబ్ బచ్చన్‌, ప్రభాస్ తో సహా కల్కి 2898 AD నిర్మాతలు, నటులకు ఆచార్య ప్రమోద్ కృష్ణం లీగల్ నోటీసులు పంపారు. ఈ క్రమంలో ఆచార్య ప్రమోద్ కృష్ణం మాట్లాడుతూ.. సనాతన గ్రంథాలను మార్చకూడదు. హిందువుల మనోభావాలతో ఆడుకోవడం సినిమావాళ్లకు కాలక్షేపంగా మారింది. ఇక సహించేది లేదు.

 కల్కి నారాయణ భగవానుడి అవతారం. కల్కి గురించి పురాణాల్లో, గ్రంధాల్లో స్పష్టంగా ఉంది. అది కాకుండా వీళ్లకు ఇష్టం వచ్చినట్టు మార్చి తీశారు అని అన్నారు. అలాగే ఆచార్య ప్రమోద్ లాయర్ కూడా మాట్లాడుతూ.. హిందూ పురాణాలను ఇష్టమొచ్చినట్టు మార్చి సినిమా తీసినందుకు నటీనటులకు, నిర్మాతలకు నోటీసులు పంపించాము అని తెలిపారు. దీంతో ఈ వార్త వైరల్ గా మారింది.

 మరో ప్రక్క ఈ చిత్రం టికెట్‌ బుక్కింగ్స్‌ అప్లికేషన్‌ ‘బుక్‌ మై షో’లో అత్యధిక టికెట్స్‌ బుక్‌ అయిన సినిమాగా ఖ్యాతి గడించింది. 12.15 మిలియన్స్‌ (దాదాపు రూ.1 కోటి 25 లక్షలు) టికెట్స్‌ బుక్‌ అయిన ఈ సినిమా అంతకుమందు ‘జవాన్‌’ సినిమా పేరిట ఉన్న రికార్డును తిరగరాసింది. ‘జవాన్‌’ 12.01 (దాదాపు రూ.1 కోటి 20 లక్షలు) మిలియన్స్‌ టికెట్‌ బుకింగ్స్‌తో ప్రస్తుతం రెండో స్థానంలో ఉంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి