ఎరక్క పోయి ఇరుక్కున్న పాయల్‌ రాజ్‌పుత్‌.. కేసు నమోదు..

Published : Aug 21, 2021, 07:33 AM IST
ఎరక్క పోయి ఇరుక్కున్న పాయల్‌ రాజ్‌పుత్‌.. కేసు నమోదు..

సారాంశం

పెద్దపల్లి పట్టణానికి చెందిన బొంకూరి సంతోష్‌ బాబ్జీ.. న్యాయవాది డొంకెన రవి ద్వారా పాయల్‌రాజ్‌పుత్‌, షాపింగ్‌ మాల్‌ యాజమాని వెంకటేశ్వర్లు, అతడి భార్య మాస్కులు ధరించకుండా, భౌతిక దూరంగా పాటించకుండా కోవిడ్‌ నిబంధనలను ఉల్లంఘించారంటూ పెద్దపల్లి జూనియర్‌ సివిల్‌ కోర్ట్ లో 12న పిటిషన్‌ దాఖలు చేశారు.

`ఆర్ఎక్స్ 100` భామ పాయల్‌ రాజ్‌పుత్‌పై కేసు నమోదైంది. కరోనా నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆమెపై కేసు నమోదు చేశారు. ఇటీవల ఆమె పెద్దపల్లిలో వెంకటేశ్వర షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. గత నెల 11న ఈ కార్యక్రమం జరిగింది. ఆ సమయంలో పాయల్‌, షాపు యాజమాన్యం మాస్కులు ధరించకుండా, భౌతిక దూరంగా పాటించకుండా కోవిడ్‌ నిబంధనలను ఉల్లంఘించారని వచ్చిన ఫిర్యాదు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

పెద్దపల్లి పట్టణానికి చెందిన బొంకూరి సంతోష్‌ బాబ్జీ.. న్యాయవాది డొంకెన రవి ద్వారా పాయల్‌రాజ్‌పుత్‌, షాపింగ్‌ మాల్‌ యాజమాని వెంకటేశ్వర్లు, అతడి భార్య మాస్కులు ధరించకుండా, భౌతిక దూరంగా పాటించకుండా కోవిడ్‌ నిబంధనలను ఉల్లంఘించారంటూ పెద్దపల్లి జూనియర్‌ సివిల్‌ కోర్ట్ లో 12న పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిని పరిశీలించిన జడ్జి కేసు నమోదు చేసి విచారణ జరపాలని పెద్దపల్లి పోలీసులను ఆదేశించారు. ఇందులో భాగంగా పాయల్‌తోపాటు షాపింగ్‌ యాజమానిపై పోలీసులు ఇరవై రోజుల క్రితం కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్టు ఎస్‌ రాజేష్‌ వెల్లడించారు. 

దీంతో ఎరక్కపోయి ఇరుక్కున్నట్టయ్యింది పాయల్‌ పరిస్థితి. `ఆర్‌ఎక్స్ 100`తో పాపులర్‌ అయిన పాయల్ రాజ్‌పుత్‌.. హీరోయిన్‌గా రాణించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తుంది. ఆ స్థాయి హిట్‌ కోసం వేచిచూస్తుంది. ప్రస్తుతం ఆమె తమిళంలో `ఏంజెల్‌`, తెలుగులో `కిరాతక` చిత్రాల్లో నటిస్తుంది.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Sivakarthikeyan: కారు ప్రమాదం నుంచి తప్పించుకున్న శివకార్తికేయన్, నడిరోడ్డుపై గొడవ సెటిల్ చేసిన హీరో
Ashika Ranganath: దాదాపు 30 ఏళ్ళ వయసు తేడా ఉన్న ముగ్గురు హీరోలతో రొమాన్స్.. హీరోయిన్ రియాక్షన్ వైరల్