అల్లు అర్జున్ కి షాక్, కేసు నమోదు.. వివాదంగా మారిన నంద్యాల పర్యటన

Published : May 11, 2024, 10:02 PM IST
అల్లు అర్జున్ కి షాక్, కేసు నమోదు.. వివాదంగా మారిన నంద్యాల పర్యటన

సారాంశం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన స్నేహితుడు, వైసిపి అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డికి మద్దతు తెలపడం కోసం నంద్యాలలో పర్యటించిన సంగతి తెలిసిందే.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన స్నేహితుడు, వైసిపి అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డికి మద్దతు తెలపడం కోసం నంద్యాలలో పర్యటించిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ పర్యటనలో పుష్పరాజ్ క్రేజ్ ఏంటో మరోసారి తెలిసింది. బన్నీకి భారీ ఎత్తున అభిమానులు నీరాజనాలు పట్టారు. 

ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్, శిల్పా రవిచంద్ర రెడ్డి ఇద్దరూ మంచి స్నేహితులు. నంద్యాలలో బన్నీ మాట్లాడుతూ రవిచంద్ర రెడ్డి తన మనసుకు నచ్చిన మిత్రుడు అని తెలిపారు. తాను వస్తానంటే రవిచంద్ర వద్దని చెప్పారు. కానీ స్వయంగా వెళ్లి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు బన్నీ నంద్యాలలో మీడియాకి తెలిపారు. 

శిల్ప రవిచంద్ర ఇంటికి బన్నీ రావడంతో ఆ ప్రాంతం జన సంద్రంలాగా మారింది. వేలాదిమంది అభిమానులు అక్కడికి చేరుకున్నారు. అయితే శిల్పా రవిచంద్ర, అల్లు అర్జున్ ఇద్దరికీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి షాక్ ఇచ్చారు. 

ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఎలాంటి అనుమతి లేకుండా భారీగా జన సమీకరణ చేసారంటూ కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 188 కింద బన్నీ, రవిచంద్రపై కేసు నమోదు చేశారు. తన స్నేహితుడిని ఈ ఎన్నికల్లో గెలిపించాలని అల్లు అర్జున్ అక్కడికి వచ్చిన ప్రజలని కోరిన సంగతి తెలిసిందే. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ప్రభాస్ అభిమానుల మధ్య నలిగిపోయిన నిధి అగర్వాల్, రాజాసాబ్ ఈవెంట్ లో స్టార్ హీరోయిన్ కు చేదు అనుభవం..
Gunde Ninda Gudi Gantalu Today: ‘ఇతను ఎవరో నాకు తెలీదు’ మౌనిక మాటకు పగిలిన బాలు గుండె, మరో షాకిచ్చిన శ్రుతి