మనసుకు నచ్చితే ఏ పార్టీలో ఉన్నా సపోర్ట్ చేస్తా.. తన ఫ్రెండ్ గురించి నంద్యాలలో అల్లు అర్జున్ కామెంట్స్

Published : May 11, 2024, 05:49 PM IST
మనసుకు నచ్చితే ఏ పార్టీలో ఉన్నా సపోర్ట్ చేస్తా.. తన ఫ్రెండ్ గురించి నంద్యాలలో అల్లు అర్జున్ కామెంట్స్

సారాంశం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాల పర్యటన సోషల్ మీడియాలో సంచలనాలు సృష్టిస్తోంది. తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర రెడ్డికి మద్దతు ఇవ్వడం కోసం అల్లు అర్జున్ సతీ సమేతంగా నంద్యాల వెళ్లారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాల పర్యటన సోషల్ మీడియాలో సంచలనాలు సృష్టిస్తోంది. తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర రెడ్డికి మద్దతు ఇవ్వడం కోసం అల్లు అర్జున్ సతీ సమేతంగా నంద్యాల వెళ్లారు. బన్నీ కోసం అభిమానులు జనసంద్రంలా తరలి వచ్చారు. నంద్యాలలో అల్లు అర్జున్ శిల్పా రవిచంద్ర రెడ్డి నివాసానికి చేరుకున్నారు. 

అనంతరం రవిచంద్రారెడ్డితో కలసి అభిమానులకు అభివాదం చేసారు. శిల్పా రవిచంద్ర రెడ్డి భార్య.. అల్లు అర్జున్ సతీమణి స్నేహ రెడ్డి ఇద్దరూ స్నేహితులు. ఆ విధంగా వీళ్ళిద్దరూ కూడా మంచి ఫ్రెండ్స్ అయ్యారట. గత ఎన్నికల్లో రవిచంద్ర రెడ్డి కోసం ట్వీట్ చేశానని బన్నీ తాజాగా నంద్యాలలో మీడియాతో తెలిపారు. 

 

కానీ ఈసారి ట్వీట్ సరిపోదు.. ఇంటికి వెళ్లి మద్దతు ఇవ్వాలని అనిపించింది. ఆయన వద్దు.. మీకు ప్రాబ్లెమ్ అవుతుంది అని చెప్పారు. పర్వాలేదు నేను వస్తాను అని తానే నిర్ణయించుకుని వచ్చినట్లు అల్లు అర్జున్ తెలిపారు. పార్టీలతో సంబంధం లేదని అల్లు అర్జున్ తెలిపాడు. తన ఫ్రెండ్స్, మనసుకు నచ్చినవాళ్లు ఏ పార్టీలో ఉన్న సపోర్ట్ చేస్తానని అల్లు అర్జున్ తెలిపాడు. 

కొన్ని రోజుల క్రితమే బన్నీ.. పవన్ కళ్యాణ్ కి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇంతలోనే బన్నీ ఒక వైసిపి అభ్యర్థికి మద్దతు ఇవ్వడంపై సోషల్ మీడియాలో తీవ్రంగా చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ ఇంతకాలం పోరాడింది వైసిపి వాళ్ళతోనే కదా అంటూ కొందరు అంటుంటే.. ఫ్రెండ్  కోసం వెళ్లడంలో తప్పు లేదని మరికొందరు అంటున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 విన్నర్‌లో మార్పు.. ఆడియెన్స్ ఓటింగ్‌తో పనిలేదా? అంతా వీళ్లదే నిర్ణయం
Emmanuel: కట్టే కాలే వరకు ఎంటర్‌టైన్‌ చేస్తా.. బిగ్‌ బాస్‌ మాటలకు ఇమ్మాన్యుయెల్‌ కన్నీటి పర్యంతం