కమల్ హాసన్ పై కేసు నమోదు.. 'హిందువే టెర్రరిస్ట్' కామెంట్స్ కు మూల్యం!

By Siva KodatiFirst Published May 15, 2019, 10:37 AM IST
Highlights

కమల్ హాసన్ తప్పకుండా భారత దేశం గర్వించదగ్గ నటుడు. కానీ కమల్ హాసన్ వ్యవహార శైలి మాత్రం వివాదాలకు కేంద్రబిందువుగా మారుతూ ఉంటుంది. పలు సందర్భాల్లో కమల్ హాసన్ చేసే రాజకీయపరమైన వ్యాఖ్యలు అదుపుతప్పుతుంటాయి.

కమల్ హాసన్ తప్పకుండా భారత దేశం గర్వించదగ్గ నటుడు. కానీ కమల్ హాసన్ వ్యవహార శైలి మాత్రం వివాదాలకు కేంద్రబిందువుగా మారుతూ ఉంటుంది. పలు సందర్భాల్లో కమల్ హాసన్ చేసే రాజకీయపరమైన వ్యాఖ్యలు అదుపుతప్పుతుంటాయి. ఇటీవల కమల్ హాసన్ హిందువుల మనోభావాలు దెబ్బతినేలా అలాంటి వ్యాఖ్యలే చేశారు. 

కమల్ హాసన్ ఓ పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతూ.. భారత దేశంలో తొలి టెర్రరిస్ట్ హిందువే అని వ్యాఖ్యానించారు. గాంధీని హత్య చేసిన గాడ్సే హిందూ టెర్రరిస్ట్ అంటూ కమల్ హాసన్ తెలిపారు. మతంపేరుతో కొందరు దేశంలో మారణహోమం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని పరోక్షంగా కమల్ కమల్ హాసన్ బిజెపికి చురకలంటించారు. రాజకీయ నాయకులపై ఎలాంటి విమర్శలైనా చేయవచ్చు. 

ఓ వ్యవస్థ, మతం, ప్రజల గురించి మాట్లాడే సమయంలో జాగ్రత్త వహించాలి. కానీ కమల్ దూకుడు వ్యవహారశైలి తీవ్ర వివాదంగా మారుతోంది. తమిళనాడు కరూర్ జిల్లాలో కమల్ పై రామకృష్ణ అనే వ్యక్తి కేసు నమోదు చేశారు. కమల్ హాసన్ హిందువులు టెర్రరిస్ట్ లు అంటూ చేసిన వ్యాఖ్యలు తమ మనోభావాల్ని కించపరిచే విధంగా ఉన్నాయని రామకృష్ణ అన్నారు. కమల్ హాసన్ పై పోలీసులు 15ఏ, 295ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

click me!