
బ్రిటీష్ కొలంబియాకు చెందిన నటుడు, నిర్మాత కైల్ డురాక్ తన ఒంటి మీద బట్టలుంటే చాలా చిరాకుపడతాడట. ఎప్పుడూ కూడా బట్టలు లేకుండానే కనిపిస్తాడు ఈ నటుడు. ఎందుకలా చేస్తున్నారని ప్రశ్నిస్తే.. బట్టలంటే తనకు ఎలర్జీ అని, చిన్నప్పటి నుండే నగ్నత్వానికి బానిసయ్యాయని చెబుతున్నాడు.
చిన్నప్పటి నుండి బట్టలు విప్పి నిద్రపోవడం తనకు అలవాటైందని చెప్పారు. తన తల్లితండ్రులు నిద్రపోగానే బట్టలన్నీ విప్పేసి పడుకునేవాడినినని గుర్తు చేసుకున్నాడు. ప్రస్తుతం తనకు ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు బట్టలు విప్పేసి స్వేచ్చగా జీవిస్తున్నట్లు చెప్పాడు.
తనలా నగ్నంగా తిరగాలని కోరుకునేవారు చాలా మంది ఈ ప్రపంచంలో ఉన్నారని, ప్రభుత్వం దానికి అనుమతి ఇవ్వాలని అడుగుతున్నాడు. బట్టలతే తనకు చిరాకని చెప్పిన డురాక్ పనిలోకి వెళ్లేప్పుడు మాత్రం వాటిని వేసుకోక తప్పడం లేదని అన్నాడు.
పనిచేసే ప్రాంతంలో కూడా ఎవరూ లేని చోటకు వెళ్లి దుస్తులు విప్పేసి రిలాక్స్ అవుతానని చెప్పారు. తనకు ఎప్పుడూ నగ్నంగానే ఉండాలనుంటుందని, మనసుకు ఇష్టపడి అలా చేస్తున్నానని అన్నారు. ఎక్కువసేపు బట్టలు వేసుకొని ఉంటే తన శరీరంపై ఏవో పాకుతున్నట్లుగా ఉంటుందని అన్నారు.